Abn logo
Feb 23 2020 @ 01:03AM

విదేశాల్లోని కేసులకూ ‘వివాద్‌ సే విశ్వాస్‌’

  • స్పష్టం చేసిన ఆదాయం పన్ను శాఖ 

పెండింగ్‌లో ఉన్న వ్యక్తిగత ఆదాయ పన్ను వివాదాల పరిష్కారం కోసం ఈసారి బడ్జెట్‌లో ప్రకటించిన ‘వివాద్‌ సే విశ్వాస్‌’ పథకంపై ఐటీ శాఖ మరింత స్పష్టత ఇచ్చింది. విదేశాల్లోని మధ్యవర్తిత్వ కోర్టుల్లో విచారణలో ఉన్న కేసులకూ ఈ పథకం వర్తించనుందని తెలిపింది. పన్ను వివాదాలను పరిష్కరించుకునేందుకు ఇది సువర్ణావకాశమంటూ ఐటీ శాఖ అన్ని ప్రధాన పత్రికల ద్వారా ప్రకటనలు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి 31 కంటే ముందు దాఖలైన అప్పీళ్లు, పిటిషన్లు ఈ పథకాన్ని ఉపయోగించుకునే వీలుకల్పించారు.  ఏదేని ఏడాదిలో రూ.5 కోట్ల లోపు పన్ను వివాదాల పరిష్కారం కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. 

Advertisement
Advertisement
Advertisement