బాలలతో పనిచేయిస్తే చట్టరిత్యా నేరం

ABN , First Publish Date - 2021-10-17T04:51:09+05:30 IST

బాలలతో పనులు చేయిస్తే చట్టరిత్యా నేరమవుతుందని ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎన్‌.సరస్వతి టిం బర్‌ డిపో యజమానులకు సూచించారు.

బాలలతో పనిచేయిస్తే చట్టరిత్యా నేరం
వీడియో కాల్‌ ద్వారా డిపో యజమానులతో మాట్లాడుతున్న ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎన్‌.సరస్వతి

బద్వేలు రూరల్‌, అక్టోబరు 16: బాలలతో పనులు చేయిస్తే చట్టరిత్యా నేరమవుతుందని ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎన్‌.సరస్వతి టిం బర్‌ డిపో యజమానులకు సూచించారు. కార్మికుల దినోత్సవం సందర్భంగా మండల లీగల్‌ సర్వీసెల్‌ ఆధ్వర్యంలో టింబర్‌ డిపో యజమా నులకు నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సుపై జడ్జి వీడియో కాల్‌ ద్వారా మాట్లాడుతూ పక్కింటి వారు, దాయాదులకు ఇబ్బందులకు గురి చేయడాన్ని అర్జీద్వారా కోర్టుకు తెలియపరిస్తే వారిని పిలిపించి సమస్యకు పరిష్కార మార్గం చూపి రాజీ చేసి పంపుతామని తెలిపా రు.

కోర్టులో ఉండే కేసుల్లో లోక్‌అదాలత్‌ ద్వారా రాజీపడితే అదే కేసు లో అపీల్‌కు పోయే అవకాశం ఉండదని, కోర్టు ఫీజులు కూడా తిరిగి చెల్లిస్తామని తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు జి.జే.పి.ప్రభాకర్‌, పారా లీగల్‌ వలంటీర్స్‌ ఓబయ్య, ఓఎస్వీ ప్రసాద్‌, మునెయ్య, రహ్మత్‌బాష, రవికుమార్‌, టింబర్‌ డిపో యజమానులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-17T04:51:09+05:30 IST