అది సీజ్‌ చేసిన మద్యం!

ABN , First Publish Date - 2020-03-30T10:39:21+05:30 IST

కొండాపూర్‌లోని ఓ గోదాం నుంచి ‘మద్యం రవాణా’ విషయమై ‘ఆంధ్రజ్యోతి’లో ఆదివారం ప్రచురితమైన కథనంపై సైబరాబాద్‌ పోలీసులు వివరణ ఇచ్చారు.

అది సీజ్‌ చేసిన మద్యం!

అక్రమంగా నిల్వ చేసినందుకు కేసు నమోదు

హైదరాబాద్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): కొండాపూర్‌లోని ఓ గోదాం నుంచి ‘మద్యం రవాణా’ విషయమై ‘ఆంధ్రజ్యోతి’లో ఆదివారం ప్రచురితమైన కథనంపై సైబరాబాద్‌ పోలీసులు వివరణ ఇచ్చారు. మద్యం అక్రమ నిల్వపై అందిన విశ్వసనీయమైన సమాచారం మేరకు.. శేరిలింగంపల్లి ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ శుక్రవారంనాడు ఆ గోదాంపై దాడి చేసి 5 కార్టన్ల బీరు.. ఒక కార్టన్‌ విస్కీని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారని వివరించారు. అది సీజ్‌ చేసిన మద్యమని.. ఇందులో స్థానిక పోలీసుల ప్రమేయం ఏమీ లేదని వారు స్పష్టం చేశారు. 

Updated Date - 2020-03-30T10:39:21+05:30 IST