Advertisement
Advertisement
Abn logo
Advertisement

అది దోపిడీ దొంగలు కట్టించిన ఆలయం... తోలు బెల్టు పెట్టుకుంటే నో ఎంట్రీ.. మద్యం ప్రసాదంగా ఇస్తూ ఆలయ పూజారి ఏం చేస్తారంటే..

దేశవ్యాప్తంగా ఈరోజు నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి. విజయదశమి వరకూ ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. దేశంలో అమ్మవారి ఆలయాలు అనేకం ఉన్నాయి. అయితే వీటిలో పురాతన చరిత్ర కలిగిన ఆలయాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఈ ఆలయాల నిర్మాణం వెనక ఆసక్తికర గాథలు ఉంటాయి. వాటిలో ఒకటే రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలోని భన్వల్ గ్రామంలోని భన్వాలా మాతా మందిరం. ఈరోజు నుంచి ఇక్కడ కూడా దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మిగిలిన ఆలయాల్లో మాదిరిగా ఈ ఆలయంలో అమ్మవారికి పులిహోర తదితర ప్రసాదాలకు బదులు మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు. 

వినేందుకు ఇది వింతగా అనిపించినప్పటికీ ఇది ఆలయంలో ఆచారంగా కొనసాగుతూ వస్తోంది. అయితే ఇక్కడికి వచ్చే భక్తుల దగ్గర బీడీలు, సిగరెట్లు, జర్దా, తంబాకు, తోలు బెల్టు, తోలు పర్సు మొదలైనవి ఉంటే వారు అమ్మవారికి ప్రసాదం సమర్పించేందుకు అనర్హులు. పైగా ఇక్కడ అమ్మవారికి సమర్పించే మద్యాన్ని భక్తులు మత్తు పదార్థంగా భావించరు. ఆలయ పూజారి తన కళ్లు మూసుకుని, మద్యంతో నిండిన వెండి పాత్రను అమ్మవారి ముందు ఉంచుతారు. ఈ విధంగా రోజుకు మూడుసార్లు అమ్మవారికి మద్యాన్ని సమర్పిస్తారు. ఇలా మూడవసారి సమర్పించిన మద్యం పాత్రను అమ్మవారి ముందు ఉంచాక కొద్దిసేపటి తరువాత దానిలో సగం మద్యమే మిగులుతుంది. దీనిని అమ్మవారి అనుగ్రహంగా భక్తులు భావిస్తారు.

ఈ ఆలయానికి 800 ఏళ్ల పురాతన చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని రాజులో లేక ధర్మ గురువులో నిర్మించలేదు. దాచికాచి దోపిడీలకు పాల్పడే దొంగలు నిర్మించారు. ఆలయంలో రెండు అమ్మవార విగ్రహాలు ఉంటాయి. ఒక అమ్మవారి విగ్రహాన్ని బ్రాహ్మణి మాతా అని పిలుస్తారు. ఈ అమ్మవారికి మిఠాయిలను ప్రసాదంగా పెడతారు. మరో అమ్మవారి విగ్రహాన్ని కాళీమాతగా కొలుస్తారు. ఈ అమ్మవారికి మద్యాన్ని ప్రసాదంగా సమర్పిస్తారు. ఈ ఆలయంలో భక్తులు కోరుకున్న కోర్కెలు నెరవేరుతాయని, అవి తీరాక, మరోమారు అమ్మవారిని సందర్శించుకోవాలని భక్తులు చెబుతుంటారు. 

స్థానికంగా ఉన్న వయోవృద్ధులు తెలిపిన వివరాల ప్రకారం.. పూర్వకాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజు తన సైన్యం సాయంతో ఒక దొంగల మఠాను చుట్టుముట్టాడు. దీంతో ఆ దొంగల ముఠా నాయకుడు తమను కాపాడమంటూ అమ్మవారిని వేడుకున్నాడట. దీంతో అమ్మవారు... ఆ దోపిడీ దొంగలను మేకలు, బర్రెలుగా మార్చివేసిందట. ఈ విధంగా ప్రాణాలు దక్కించుకున్న దోపీడీ ముఠా నాయకుడు అమ్మవారికి ఈ ఆలయం నిర్మించాడట. రాతియుగంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement