Advertisement
Advertisement
Abn logo
Advertisement

జీవన మంత్రం: నిముషం లేటయ్యేకన్నా.. మూడు గంటలు ముందుండటం ఉత్తమం.. దిమ్మతిరిగే షేక్స్పియర్ కొటేషన్స్ మీకోసం..

విలియం షేక్స్పియర్ పేరొందిన ఆంగ్ల కవి. నాటకకర్త, నటుడు. ఇతని నాటకాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. పలు బాషలలోనూ అనువాదమయ్యాయి. మనకు జీవితంలో కొత్త కోణాన్ని చూపించే కొన్ని షేక్స్పియర్ కొటేషన్స్ చూద్దాం.. 

1. మూర్ఖుడు ఎల్లప్పుడూ తాను ఎంతో బుధ్దిమంతుడినని అనుకుంటాడు. అయితే బుధ్దిమంతుడు మాత్రం తాను ఎప్పుడూ మూర్ఖపు పనులు చేస్తుంటానని అనుకుంటాడు.

2. అందరినీ ప్రేమించండి.. కొందరినే నమ్మండి.. ఎవరికీ ఇబ్బందులు కలిగించకండి

3. మనం ఏమిటో మనకు తెలుసు.. అయితే మనం ఏమవుతామో మనకే తెలియదు. 

4. నువ్వు ప్రేమలో పడితే కష్టాలపాలవుతావు. అప్పుడు మరింతగా  ప్రేమించు. అంతలా ప్రేమించినా కష్టాలు కూడా అలానే  వెంటాడుతుంటే ఇంకా ప్రేమిస్తూనే ఉండు. ఆ కష్టాలు అంతమయ్యేంతవరకూ నీ ప్రేమను కొనసాగించు.


5. ఒక్క నిముషం లేటయ్యేకన్నా.. మూడు గంటలు ముందుండటం ఉత్తమం

6. ఖాళీగా ఉన్న పాత్రకు చప్పుడెక్కువ.

7. పేదరికం, సంతృప్తి అనేవే నిజమైన సంపద

8. ఇతరులు ఏదో సాయం చేస్తారన్న నమ్మకమే అన్ని ఆపదలకు ముఖ్య కారణం.

9. నీ ఆలోచనలు గొప్పవని నువ్వు ఎలా భావిస్తావో.. నీ పనులను కూడా గొప్పగా మార్చుకో!

10. మంచి అనేది మరింతగా పెరిగిపోతే అది చెడుకు దారితీస్తుంది.

11. అసూయ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అది పెరిగితే తిరిగి మనకే నష్టం కలిగిస్తుంది.

12. గొప్పతనానికి భయపడవద్దు.. కొందరు గొప్పగా పుడతారు,. కొందరు గొప్పతనాన్ని సాధిస్తారు. మరికొందరు గొప్పతనాన్ని కలిగి ఉంటారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement