Abn logo
Sep 27 2021 @ 00:38AM

కార్మిక హక్కులను హరించడం కేంద్రానికి తగదు

రిలే నిరాహార దీక్షా శిబిరంలో మట్లాడుతున్న డి.ఆదినారాయణ

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ

కూర్మన్నపాలెం, సెప్టెంబరు 26: కార్మిక హక్కులను హరించాలని చూడటం కేంద్రానికి తగదని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ అన్నారు. కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 227వ రోజు కొనసాగాయి. ఆదివారం ఈ దీక్షలలో బ్లాస్ట్‌ఫర్నేస్‌ విభాగం ఉద్యోగులు కూర్చున్నారు. ఈ శిబిరంలో పాల్గొన్న కార్మికులనుద్దేశించి ఆదినారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం దేశ వ్యాప్తంగా ప్రజా సంఘాలు నిర్వహిస్తున్న భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలన్నారు. మాజీ డిప్యూటీ మేయర్‌ దాడి సత్యనారాయణ మాట్లాడుతూ ఉక్కు కర్మాగారం వస్తే జీవనం మెరుగుపడుతుందనే ఆశతో భూములిచ్చిన ఉక్కు నిర్వాసితులకు నేటివరకు న్యాయం జరగలేదన్నారు. ఉక్కు కర్మాగారానికి సొంత గనులు కేటాయించకపోవటం తీవ్ర అన్యాయమన్నారు.        మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు జగన్నాథరావు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రక్రియను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఇంటక్‌ ఉపాధ్యక్షుడు జెర్రి పోతుల ముత్యాలు మాట్లాడుతూ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.  మానవ హక్కుల సంఘం కార్యదర్శి సుధ, అడ్వకేట్‌ జవహర్‌, సన్యాసిరావు, మస్తానప్ప, చిత్రాడ వెంకటరమణ, బడ్డ గోవింద్‌, రామస్వామి, రామకృష్ణ, అప్పలరాజు, శ్రీనివాసరాజు, నగేష్‌, గంగవరం గోపి, వేములపాటి ప్రసాద్‌, జి.ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.