ఓటీఎస్‌ పేరుతో పేదలను వేధించడం ప్రభుత్వానికి తగదు

ABN , First Publish Date - 2021-12-07T05:22:24+05:30 IST

ఓటీఎస్‌ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పేదలను వేధింపులకు గురిచేయడం తగదని టీడీపీ ఇన్‌ఛార్జి దేవగుడి భూపేశ్‌రెడ్డి పేర్కొన్నారు.

ఓటీఎస్‌ పేరుతో పేదలను వేధించడం ప్రభుత్వానికి తగదు
మైలవరం గౌరవసభలో మాట్లాడుతున్న భూపేశ్‌రెడ్డి

జమ్మలమడుగు రూరల్‌, డిసెంబరు 6: ఓటీఎస్‌ పేరుతో  రాష్ట్ర ప్రభుత్వం పేదలను వేధింపులకు గురిచేయడం తగదని టీడీపీ ఇన్‌ఛార్జి దేవగుడి భూపేశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ మేరకు  పార్టీ నాయకులతో కలిసి ఆయన వినూత్న రీతిలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి సోమవారం  వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా అంబేడ్కర్‌ కల్పించిన జీవించే హక్కును జగన్‌ ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం జీవో.82ను విడుదల చేసి డబ్బును చెల్లించాలని వేధిస్తూ జీవించే హక్కును హరించే విధంగా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయాయన్నారు.  అరాచక ప్రభుత్వం ఆగడాల నుంచి కాపాడేందుకు అంబేడ్కర్‌ మరోమారు ౖ అవతరించి ఆంధ్రప్రదేశ్‌ను కాపాడాలని భూపేశ్‌ విజ్ఞప్తి చేశారు.  కార్యక్రమంలో టీడీపీ నాయకులు పొన్నతోట శ్రీను, మల్లికార్జున, జాషువా, ఐఎల్‌ చిన్న, తదితరులు పాల్గొన్నారు.

అరాచక పాలనను సాగనంపుదాం

మైలవరం, డిసెంబరు 6 : వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనను సాగనంపుదామని జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ చార్జ్‌ భూపేశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మండల పరి ధిలోని వద్దిరాల గ్రామంలో మాజీ సర్పంచ్‌లు చంద్రశేఖర్‌రెడ్డి, రామగోవింద్‌ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల గౌరవసభ కార్యక్ర మాన్ని నిర్వహించారు. ముఖ్య అతిఽథిగా పాల్గొన్న  భూపేశ్‌ మాట్లాడుతూ ఒక్కసారి అవకాశం ఇవ్వండి ప్లీజ్‌ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి రాష్ర్టాన్ని అంధకారంలోకి నెట్టారని ధ్వజమెత్తారు. రాష్ట్రం రెండు ముక్కలైన తర్వాత లోటు బడ్జెట్‌లో కూడా అభివృద్ధి చేసిన ఘనత మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు.  ఓటీఎస్‌ పేరుతో రూ.10వేలు. రూ.15వేలు, రూ.20వేల చొప్పున పేద నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. అనంతరం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జంబాపురం రమణారెడ్డి, జిల్లా రైతు విబాగ కార్యదర్శి మల్లిఖార్జున, జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు,  తెలుగు యువత కార్యనిర్వహణ కార్యదర్శి నాగేశ్వరరెడ్డి, టీడీపీ నాయకులు మంత్రిజాఘవ, కొండయ్య,  పాపిరెడ్డి, బాలరాజు, మాజీ ఎంపీటీసీ నరసింహులు, సూర్య పెద్దిరాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-07T05:22:24+05:30 IST