‘అంగన్‌వాడీలను అవమానించడం తగదు’

ABN , First Publish Date - 2021-06-24T05:39:39+05:30 IST

లక్షలాది మంది అంగన్‌వాడీ వర్కర్లను రాష్ట్ర ప్రభుత్వం అవమానించిందని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) నంద్యాల శాఖ గౌరవాధ్యక్షుడు కేఎండీ గౌస్‌ ఆరోపిం చారు.

‘అంగన్‌వాడీలను అవమానించడం తగదు’

నంద్యాల, జూన్‌ 23: లక్షలాది మంది అంగన్‌వాడీ వర్కర్లను రాష్ట్ర ప్రభుత్వం అవమానించిందని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) నంద్యాల శాఖ గౌరవాధ్యక్షుడు కేఎండీ గౌస్‌ ఆరోపిం చారు.  బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గౌస్‌ మాట్లాడుతూ  ఈనెల 20వ తేదీన మెగా కరోనా వ్యాక్సినేషన్‌ విజయవంతం కావ డంలో కీలకపాత్ర పోషించిన అంగన్‌వాడీ వర్కర్లు, ఆయాలను విస్మరించి కేవలం ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, వలంటీర్లు, సచివాలయ సిబ్బంది కృషినే గుర్తించడం తగదని అన్నారు. ఈ వైఖరి వల్ల అంగన్‌వాడీ వర్కర్లు, ఆయాలను అవమానపరిచినట్లయిందని, వారికి  రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. వారికి జీతాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు హన్నమ్మ, జమృత్‌బేగం, శాంతకుమారి, లక్ష్మీకొండమ్మ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-06-24T05:39:39+05:30 IST