Advertisement
Advertisement
Abn logo
Advertisement

వింటే చాలదు, ఆచరించాలి!

దైవ మందిరాల్లో ఉపదేశాలు విన్నప్పుడు, పవిత్ర గ్రంథాలను చదివినప్పుడు ఎన్నో గొప్ప విషయాలు తెలుస్తాయి. విశ్వాసంతో నిండిన జీవితాన్ని ఎలా గడపాలో అవి చెబుతాయి. అయితే కేవలం విన్నంత మాత్రాన, చదివినంత మాత్రాన ప్రయోజనం ఉండదు. ‘‘నేను చెప్పే ఈ మాటలు విని, వాటిని పాటించే ప్రతి ఒక్కరూ రాతి బండ మీద ఇల్లు నిర్మించుకున్న బుద్ధికుశలత ఉన్న మనుషుల లాంటి వారు.  భారీగా వర్షం పడి, వరదలు ముంచుకొచ్చి. గాలులు భీకరంగా వీచినా సరే... ఆ ఇల్లు కూలిపోదు. ఎందుకంటే దాని పునాది రాతి మీద ఉంది. ఇక, నేను చెప్పే మాటలు విన్నప్పటికీ వాటిని పాటించని వారందరూ తన ఇంటిని ఇసుక మీద కట్టుకున్న తెలివిలేని మనిషి లాంటి వారు. భారీ వర్షం పడి, వరదలు పొంగుకొచ్చి, గాలులు భయానకంగా వీస్తే ఆ ఇల్లు కూలిపోతుంది. పూర్తిగా నాశనమైపోతుంది (మత్తయి 7:24-27)’’ అని ఏసు ప్రభువు ఒక సందర్భంలో చెప్పాడు. దేవుని వాక్యాలను హృదయంలో నింపుకొని, వాటిని ఆచరిస్తేనే సార్థకత. అలా ఆచరించేవారే వివేకవంతులు. దైవ కృపతో వారి ఆందోళనలన్నీ దూరమవుతాయి. జీవితం నిశ్చింతగా సాగిపోతుంది.

Advertisement
Advertisement