అంబేడ్కర్‌ ఫొటో పెట్టకపోవడం సరికాదు

ABN , First Publish Date - 2022-01-28T06:04:58+05:30 IST

భారతరాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చిత్ర పటాన్ని గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పెట్టకుండా అవమానపరిచిన అధికారులపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు బర్రె జహంగీర్‌, బట్టు రామచంద్రయ్య, సుర్పంగ శివలింగం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

అంబేడ్కర్‌ ఫొటో పెట్టకపోవడం సరికాదు

 కలెక్టర్‌కు వినతిపత్రం అందచేస్తున్న దళిత సంఘాల ప్రతినిధులు


బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి

  కలెక్టరేట్‌ ఎదుట దళిత సంఘాల ఐక్యవేదిక ప్రతినిధుల డిమాండ్‌

భువనగిరి రూరల్‌, జనవరి 27: భారతరాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చిత్ర పటాన్ని గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పెట్టకుండా అవమానపరిచిన అధికారులపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు బర్రె జహంగీర్‌, బట్టు రామచంద్రయ్య, సుర్పంగ శివలింగం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈమేరకు ఆయా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట గురువారం నిరసన తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు జిల్లాలలో జరిగిన గణతంత్ర దిన వేడుకల్లో అంబేడ్కర్‌ చిత్ర పటాన్ని ఉంచకుండా జిల్లాలో అంబేడ్కర్‌ను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అదనపు కలెక్టర్‌ డి శ్రీనివా్‌సరెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో దళిత సంఘాల ప్రతినిధులు ఈరపాక నర్సింహ, పడిగెల రేణుక ప్రదీప్‌, ఇటికాల దేవేందర్‌, కొడారి వెంకటేశ, ఎర్ర మహేశ, బర్రె సుదర్శన, బట్టు నర్సింగ్‌రావు, కాకునూరి మహేందర్‌, కొల్లూరి హరీష్‌ ఉన్నారు.  

ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు: అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి 

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ నిర్మాత బీఆర్‌.అంబేడ్కర్‌ చిత్రపటం పెట్టకపోవడం అనేది ఉద్దేశ పూర్వకంగా జరిగింది కాదని అదనపు కలెక్టర్‌ డి.శ్రీనివాస్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంబేడ్కర్‌ పట్ల ప్రతి ఒక్కరికీ గౌరవం ఉందని, ఇక ముందు రిపబ్లిక్‌ డే సందర్భంగా తప్పనిసరిగా ఆయన చిత్రపటాన్ని ఉంచి పూలమాలలతో గౌరవిస్తామని తెలిపారు. దానికి అనుగుణంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సూచనలు ఇచ్చామని స్పష్టం చేశారు. 

Updated Date - 2022-01-28T06:04:58+05:30 IST