Abn logo
May 20 2020 @ 04:42AM

కరోనాతో సహజీవనం చేయాలనడం సరికాదు

సంజయ్‌ నాయకత్వంలో బీజేపీ బలోపేతం 

మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్‌రావు


కరీంనగర్‌ టౌన్‌, మే 19: కరోనాతో సహజీవనం చేయాలనడం సరికాదని మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్‌రావు నేతల తీరును తప్పుబట్టారు. మంగళవారం కరీంనగర్‌కు వచ్చిన ఆయనను ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌, జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణరావు, పలువురు పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడైన సంజయ్‌ను విద్యాసాగర్‌రావు శాలువతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్‌రావు విలేకరులతో మాట్లాడుతూ.. బండి సంజయ్‌ సేవలను గుర్తించి రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ నియమించడం హర్షణీయమన్నారు.


సంజయ్‌ నాయకత్వంలో పార్టీ బలోపేతమవుం దన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సంజయ్‌ నేతృత్వంలో బీజేపీ రాష్ట్రంలో అత్యధిక సీట్లు సాధించబో తుందన్న నమ్మకం ఉందన్నారు. కరోనాను నియంత్రించాలి తప్ప సహజీవనం చేయడమేంటని ప్రశ్నించారు. కరీంనగర్‌కు విచ్చేసిన మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌ రావును ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణరావు ఆధ్వర్యంలో పార్టీశ్రేణులు శాలువాతో సన్మానిం చారు.  

Advertisement
Advertisement