Abn logo
May 23 2020 @ 22:31PM

ఆ సినిమాలు ఇంట్లో చూడలేం.. వెబ్ రిలీజ్‌పై హీరోయిన్ ఫీలింగ్స్

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా సినీరంగం కూడా బాగా దెబ్బతింది. లాక్‌డౌన్ వల్ల థియేటర్లు మూతపడ్డాయి. దీంతో చాలా సినిమాల విడుదల కూడా వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో వెబ్ రిలీజ్ అనే అంశం సినీ పరిశ్రమలో చర్చకు వచ్చింది. దీనికి థియేటర్ యాజమాన్యాలు అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ హీరోయిన్ తాప్సీ వెబ్ రిలీజ్‌ విషయంలో తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. ఏదైనా లాభం వచ్చే విధంగానే సినిమాలు రిలీజ్ చేస్తారని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే కొన్ని చిత్రాలను ఇంట్లో కూర్చొని చూడటం అంత సంతోషంగా ఉండదని చెప్పారు. ‘అవెంజర్స్, శభాష్ మీఠూ వంటి చిత్రాలను థియేటర్లోనే చూడాలి. ఇలాంటి సినిమాలను ఇంట్లో కూర్చొని చూస్తే ఆ జోష్ ఉండదు’ అని ఆమె తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement