ప్రధానికి భద్రత కల్పించలేకపోవడం సిగ్గుచేటు: కంగనా

ABN , First Publish Date - 2022-01-06T23:07:41+05:30 IST

కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా స్టోరీ అప్‌లోడ్ చేశారు. ఇందులో ‘‘పంజాబ్‌లో జరిగింది చాలా సిగ్గు చేటు. గౌరవనీయులైన ప్రధానమంత్రి ప్రజల ద్వారా ఎన్నికైన నాయకులు. 104 కోట్ల మంది ప్రజలకు ఆయన..

ప్రధానికి భద్రత కల్పించలేకపోవడం సిగ్గుచేటు: కంగనా

ముంబై: ప్రధానమంత్రికి రక్షణ కల్పించలేకపోవడం సిగ్గుచేటని బీజేపీకి గట్టి మద్దతుదారు అయిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పంజాబ్‌ వెళ్లిన ముఖ్యమంత్రి భద్రతా కారణాల వల్ల పంజాబ్‌లోని కార్యక్రమాన్నింటినీ రద్దు చేసుకుని వెనక్కి రావడంపై కంగనా స్పందించారు. పంజాబ్‌ ప్రభుత్వం ప్రధానమంత్రికి కనీస రక్షణ కల్పించలేకపోయిందని మండిపడ్డారు. ప్రధాన మంత్రికి భద్రత కల్పించలేకపోవడం అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని కంగనా అన్నారు.


కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా స్టోరీ అప్‌లోడ్ చేశారు. ఇందులో ‘‘పంజాబ్‌లో జరిగింది చాలా సిగ్గు చేటు. గౌరవనీయులైన ప్రధానమంత్రి ప్రజల ద్వారా ఎన్నికైన నాయకులు. 104 కోట్ల మంది ప్రజలకు ఆయన ప్రతినిధి. ఆయనపై జరిగిన దాడి దేశంలోని ప్రతి ఒక్కరిపై జరిగిన దాడిగానే భావించాలి. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి. ఉగ్రవాద కార్యకలాపాలకు పంజాబ్‌ స్థావరంగా మారుతోంది. దీనిని ఆపకపోతే దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’’ అని ఆమె అన్నారు.

Updated Date - 2022-01-06T23:07:41+05:30 IST