అది 38 వేల ఏళ్ల అత్యంత పురాతన శ్మశాన వాటిక

ABN , First Publish Date - 2020-02-22T17:26:51+05:30 IST

భారత్‌లోని ఉత్తరప్రదేశ్‌లోగల బాగ్పత్ జిల్లా సనౌలీలో అత్యంత పురాతన శ్మశాన వాటిక ఉంది. శాస్త్రవేత్తలు తమ సుదీర్ఘ పరిశోధనల అనంతరం ఈ విషయాన్ని స్ఫష్టం చేశారు. ఇందుకు సంబంధించిన...

అది 38 వేల ఏళ్ల అత్యంత పురాతన శ్మశాన వాటిక

లక్నో: భారత్‌లోని ఉత్తరప్రదేశ్‌లోగల బాగ్పత్ జిల్లా సనౌలీలో అత్యంత పురాతన శ్మశాన వాటిక ఉంది. శాస్త్రవేత్తలు తమ సుదీర్ఘ పరిశోధనల అనంతరం ఈ విషయాన్ని స్ఫష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. ఈ శ్మశాన వాటికలో 3,800 ఏళ్ల అత్యంత పురాతన సమాధులను కనుగొన్నారు. భారత పురావస్తుశాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ సమాధులు స్వదేశీ యోధులకు చెందినవి. 2005 నుంచి సనౌలీలో పురావస్తుశాఖ తవ్వకాలు ప్రారంభించింది. తరువాత ఆ పనులు ఏవో కారణాలతో ఆగిపోయాయి. 2018లో తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ తవ్వకాల్లో పలు పురాతన అవశేషాలు లభ్యమయ్యాయి. ఈ తవ్వకాలను పర్యవేక్షించిన అధికారి ఎస్‌కే మంజుల్ మాట్లాడుతూ 2005-06 నుంచి ఇక్కడ సాగిస్తున్న తవ్వకాల్లో పలు సమాధులు బయటపడ్డాయి. ఈ నేపధ్యంలో ఇది భారత్‌లోనే అత్యంత పురాతన శ్మశానవాటికగా గుర్తించామని అన్నారు. 


Updated Date - 2020-02-22T17:26:51+05:30 IST