బిహార్ మీ రాష్ట్రం.: నితీష్‌కు చేతులు జోడించి వేడుకున్న తేజస్వీ

ABN , First Publish Date - 2021-01-17T21:47:20+05:30 IST

సామాన్య జనాలపై రోజూ అత్యధిక సంఖ్యలో నేరాలు జరుగుతన్నాయని అయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు కనిపించం లేదని తేజస్వీ మండిపడ్డారు.

బిహార్ మీ రాష్ట్రం.: నితీష్‌కు చేతులు జోడించి వేడుకున్న తేజస్వీ

పాట్నా: బిహార్‌లో శాంతిభద్రతలపై రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ సీనియర్ నేత ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నేర రాజధానిగా బిహార్ మారుతోందని, దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై ఉందని ఆయన చేతులు జోడించి వేడుకున్నారు. రాష్ట్ర రాజధాని పాట్నాలో ఇండిగో ఎయిర్‌లైన్స్ మేనేజర్ రూపేష్ సింగ్‌పై హత్య జరిగినా ప్రభుత్వంలో కాసింతైనా కదలిక లేదని, సామాన్య జనాలపై రోజూ అత్యధిక సంఖ్యలో నేరాలు జరుగుతన్నాయని అయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు కనిపించం లేదని తేజస్వీ మండిపడ్డారు.


పాట్నాలోని రూపేష్ సింగ్ ఇంటికి వెళ్లే దారిలో ఆదివారం మీడియాతో తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ ‘‘రూపేష్ సింగ్ కుటుంబాన్ని కలవడానికి వెళ్తున్నాను. రాష్ట్ర రాజధానిలో హత్య జరిగి ఇన్ని రోజులైనా ఇప్పటికీ ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. 2019లో రాష్ట్రంలో నేరాలు ఎక్కువగా ఉండేవి ఇప్పుడా సంఖ్య తగ్గిందంటూ రాష్ట్ర డీజీపీ లెక్కలు చెబుతున్నారు. 16 ఏళ్లుగా నితీష్‌ కుమారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. పోలీసులు ఎందుకు ఇలాంటి లెక్కలు చెబుతున్నారు? నితీష్ కుమార్‌కు నేను చేతులు జోడించి వేడుకుంటున్నాను. మీరు బలహీనమైన ముఖ్యమంత్రి అయితే కావచ్చు, కానీ మీ స్థానాన్ని కాపాడుకోవడం కోసం ప్రజల ప్రాణాలను బలి పెట్టకండి. బిహార్‌ మీ రాష్ట్రం. ఇక్కడ నేరాల్ని తగ్గించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా మీపైనే ఉంది’’ అని అన్నారు.

Updated Date - 2021-01-17T21:47:20+05:30 IST