Priyanka Gandhi పిల్లల ఇన్‌స్టా ఖాతా హ్యాక్: కేంద్రమంత్రి విచారణకు ఆదేశం

ABN , First Publish Date - 2021-12-22T17:20:26+05:30 IST

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ పిల్లల ఇన్‌స్టా అకౌంట్ హ్యాక్ ఆరోపణలపై కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది....

Priyanka Gandhi పిల్లల ఇన్‌స్టా ఖాతా హ్యాక్: కేంద్రమంత్రి విచారణకు ఆదేశం

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ పిల్లల ఇన్‌స్టా అకౌంట్ హ్యాక్ ఆరోపణలపై కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది.తన పిల్లల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను ప్రభుత్వం హ్యాక్ చేసిందంటూ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపణలు చేశారు.తన పిల్లల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను ప్రభుత్వం హ్యాక్ చేసిందంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా చేసిన ఆరోపణను ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిగణనలోకి తీసుకుందని మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు బుధవారం తెలిపారు. ఇప్పుడు ఆ ఆరోపణలపై విచారణకు ఆదేశించింది.యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను ప్రియాంకగాంధీ ప్రస్తావించారు. 



‘‘ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా నా పిల్లల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను కూడా హ్యాక్ చేస్తున్నారు. వారికి వేరే పని లేదా?’’ అని ప్రియాంకాగాంధీ ప్రశ్నించారు.అఖిలేష్ యాదవ్ ఆరోపణలపై యూపీ సీఎం యోగి స్పందించారు.‘‘బహుశా అధికారంలో ఉన్నప్పుడు అఖిలేష్ ఇలాంటివే చేసి ఉంటాడు. అందుకే ఇప్పుడు ఇతరులపై ఆరోపణలు చేస్తున్నారు.’’ అని యోగి వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-12-22T17:20:26+05:30 IST