Abn logo
Sep 24 2021 @ 01:43AM

కాపీ చెయ్యడం కష్టమబ్బా!

ప్రధాని మోదీ అమెరికాకు వెళ్తూ విమానంలో ఫైల్స్‌ను చూస్తున్న ఫొటోను ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు. ‘‘సుదీర్ఘ ప్రయాణం అంటే మన పనికి సంబంధించి ఫైల్స్‌ చూసే అవకాశం కూడా’’ అనే వ్యాఖ్య కూడా చేశారు. 

దానికి కౌంటర్‌గా కాంగ్రెస్‌ పార్టీ కొద్దిసేపటికే ఒక ట్వీట్‌ చేసింది. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ విదేశీ పర్యటనలకు వెళ్తున్నప్పుడు విమానంలోనే పాత్రికేయులకు ఇంటర్వ్యూ ఇస్తున్న 3 ఫొటోలను ఆ ట్వీట్‌ కు జతచేసి.. ‘కొన్ని ఫొటోలను కాపీ చెయ్యడం కష్టం’ అనే వ్యాఖ్య చేసింది. ప్రధాని మోదీ విమానంలో ఫైల్స్‌ చూస్తున్న ఫొటోను పలువురు బీజేపీ నాయకులు రీట్వీట్‌ చేయగా.. దివంగత ప్రధానులు లాల్‌బహదూర్‌ శాస్త్రి, రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహారావు, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ విమానంలో ఫైల్స్‌ చూస్తున్న ఫొటోలను పలువురు కాంగ్రెస్‌ నేతలు, ఇతర పార్టీల నేతలు ట్వీట్‌ చేశారు.