Abn logo
Sep 15 2021 @ 17:35PM

సోనూకు ఐటీ శాఖ సెగ...

నటుడు సోనూ సూద్‌పై ఐటీ శాఖ చూపు సారించింది. ఆయనకు సంబంధించిన ఆరు చోట్లలో అధికారులు సర్వే నిర్వహించారు. తాజా సమాచారం ప్రకారం, సూద్‌కు చెందిన ముంబైలోని వివిధ నివాసాలు, కార్యాలయాల వద్ద ప్రస్తుతం సర్వే కొనసాగుతోంది. ఆయనకు సంబంధించిన అకౌంట్స్ బుక్స్‌లో జరిగిన అవకతవకలను దృష్టిలో ఉంచుకుని ఐటీ శాఖ ఈ చర్యలు చేపట్టినట్టు చెబుతున్నారు. 

సోనూ సూద్ ఈ మధ్యే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కలసి మీడియా ముందుకొచ్చారు. ఆయన ఆప్ ప్రభుత్వం స్కూలు పిల్లల కోసం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. ఇది బీజేపీకైతే రుచించే విషయం కాదు. సోనూ సూద్‌కు తగులుతోన్న తాజా ఐటీ సెగ వెనుక కారణం అదేనంటున్నారు కొందరు. 

కొన్ని నెలల క్రితం, ముంబై మున్సిపల్ అధికారులు కూడా సోనూపై కంప్లైంట్ నమోదు చేశారు. ఆయన ఆరు అంతస్థుల నివాస భవనాన్ని తగిన అనుమతులు లేకుండానే హోటల్‌గా మార్చాడంటూ వారు ఆరోపించారు.  


ఇవి కూడా చదవండిImage Caption