Abn logo
Sep 17 2021 @ 12:09PM

Mumbai: సోనూసూద్ ఇంట్లో మూడో రోజు కొనసాగుతున్న ఐటీ దాడులు

ముంబై : ప్రముఖ సినీనటుడు,కరోనా సంక్షోభ సమయంలో పేదలను ఆదుకున్న రియల్ హీరో సోనూసూద్ ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు వరుసగా మూడో రోజైన శుక్రవారం కూడా దాడులు కొనసాగించారు. ముంబైతోపాటు జైపూర్, నాగపూర్ నగరాల్లోని సోనూసూద్ ఇళ్లలో ఐటీ అధికారులు శోధించారు.సోనూసూద్ ఆదాయం, వ్యయం, బ్యాంకు ఖాతాల పుస్తకాలను ఐటీ అధికారులు పరిశీలించారు. కరోనా వ్యాప్తి సమయంలో సోనూసూద్ వలసకార్మికులు వివిధ నగరాల నుంచి వారి స్వగ్రామాలకు చేరుకునేందుకు రవాణ సౌకర్యం ఏర్పాటు చేశారు. కరోనా రోగులకు ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య పరికరాలను అందించి పెద్ద మనసు చాటుకున్నారు. ఐటీ అధికారుల దాడులు ప్రారంభం కాగానే దేశవ్యాప్తంగా ఉన్న సోనూసూద్ అభిమానలు అతనికి మద్ధతుగా నిలుస్తూ ట్వీట్ల వర్షం కురిపించారు.


ఇవి కూడా చదవండిImage Caption