గాలివాన బీభత్సం

ABN , First Publish Date - 2020-06-05T10:12:26+05:30 IST

జిల్లాలో గురువారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమ య్యాయి.

గాలివాన బీభత్సం

మరో రెండు రోజులు వర్షాలు..

వాతావరణ శాఖ వెల్లడి


జిల్లాలో గురువారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమ య్యాయి. అలాగే రహదారులకు అడ్డంగా పెద్దపెద్ద చెట్లు నేల కూలాయి. సాలూరు, బొండపల్లి, గజపతినగరం, మెంటాడ, గుర్ల, డెంకాడ, బోగపురం, గంట్యాడ, చీపురుపల్లి, గరివిడి తదిత ర మండలాల్లో ఓ మొస్తరు వర్షం కురిసింది. ఆకాశంలో ఏర్పడ్డ కీములోనింబస్‌ మేఘాలు కారణంగా వర్షాలు కురుస్తున్నాయని, రానున్న రెండు మూడు రోజుల్లో కూడా ఇదే పరిస్థితి ఉండవచ్చనని వాతావరణ శాఖ తెలిపింది. ఫ విజయనగరం రూరల్‌: మండలంలో గురువారం ఉదయం 8 గంటలకే ఎండ వేడి ఉన్నా.. 11.30 గంటల ప్రాంతంలో వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఆకాశం మేఘావృత మైన కొద్దిసేపటికే  భారీ వర్షం కురిసింది..


దాదాపు అరగంట పాటు పడిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యా యి. ముఖ్యంగా జొన్నవలస, రాకోడు, పినవేమలి, కోరుకొండ, కోరుకొండ పాలం వంటి ప్రాంతాల్లో వర్షపునీరు రోడ్లపైనే నిలిచింది. ఫ శృంగవరపుకోట/ రూరల్‌: వెంకటరమణపేట గ్రామం వద్ద విశాఖ-అరకు ప్రధాన రహదారిలో, ఎస్‌.కోట నుంచి బొడ్డవర జంక్షన్‌ వరకు రోడ్డుపై చెట్లు విరిగిపడ్డాయి. దీంతో  ఎస్‌ఐ నీలకంఠం ప్రత్యేకంగా ఒక జేసీబీ ఏర్పాటుచేసి వాటిని తొలగింపజేశారు. సిబ్బంది  చిన్నపాటి చెట్లను తొలగించారు. పట్టణంలో రహదారిపై పడిన చెట్లను ఎస్‌ఐ కె.నీలకంఠం ఆధ్వర్యంలో పోలీసులు తొలగించారు. ఫ సాలూరు: పట్టణంలోని డీలక్స్‌ సెంటర్‌లో రోడ్డుకు అడ్డంగా పడిపోయిన చెట్టును మున్సిపల్‌ అధికారులు తొలగించారు. అలాగే రోడ్డుపై ఉన్న ఫ్లెక్సీ బోర్డులు కూడా నేలకొరిగాయి. ఫ గంట్యాడ: కొటారుబిల్లి కూడలిలో స్టేటుబ్యాంకుకు ఎదురుగా ఉన్న తాటి చెట్టు ఆగివున్న ఆటోపై కూలిపోయింది. దీంతో ఆటో నుజ్జునుజ్జు అయ్యింది.

Updated Date - 2020-06-05T10:12:26+05:30 IST