Oct 25 2021 @ 03:37AM

అతిథిగా పిలవడం ఆనందంగా ఉంది

‘‘వరుడు కావలెను’ సినిమా సంగీత్‌ కార్యక్రమానికి నన్ను అతిథిగా ఆహ్వానించి నందుకు సంతోషంగా ఉంది’’ అని కథానాయిక పూజాహెగ్డే అన్నారు. నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మీసౌజన్య దర్శకత్వంలో నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదలవుతోంది. సంగీత్‌ కార్యక్రమంలో పూజాహెగ్డే పాల్గొన్నారు. నాగశౌర్య మాట్లాడుతూ ‘‘మా సినిమా బాగా వచ్చింది. ఇది గర్వం కాదు. మా సినిమాపై ఉన్న నమ్మకం’’ అన్నారు.