‘నాకు చిన్నప్పటినుంచీ నటన, సినిమాలు అంటే ఇష్టం. అందుకే బీటెక్ అయ్యాక ఉద్యోగం చేస్తూనే షార్ట్ ఫిల్్మ్స్లో నటించా. ఆ సమయంలోనే ‘మిస్టర్ అండ్ మిస్’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించా. ఆ లఘు చిత్రాన్నే పెంచి సినిమాగా తీశాం’ అన్నారు చిత్ర హీరో శైలేష్ సన్నీ. అశోకరెడ్డి దర్శకత్వంలో క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్‌గా రూపుదిద్దుకొన్న ‘మిస్టర్ అండ్ మిస్’ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా శైలేష్ సన్నీ పాత్రికేయులతో మాట్లాడారు.
‘హీరోహీరోయిన్ల దగ్గర మిస్ అయిన సెల్‌ఫోన్ తిరిగి ఎలా దొరికింది, వారిద్దరిని ఎలా కలిపింది అనే ఇతివృత్తంతో ఈ సినిమా రూపుదిద్దుకొంది. విలేజ్ నుంచి సిటీకి వచ్చే పాత్ర నాది. ప్రేక్షకులు రెండు గంటలపాటు ఎంజాయ్ చేసే విధంగా సినిమా ఉంటుంది. ఈ సినిమా మొత్తానికి బ్యాక్‌బోన్ దర్శకుడు అశోక్రెడ్డిగారే. సినిమాలోని పాటలకు యూత్ బాగా కనెక్ట్ అవుతారు. అలాగే పేరెంట్స్ కూడా మెచ్చే సినిమా అవుతుంది. ఇక నా కొత్త సినిమాల కోసం రెండు కథలు విన్నాను. మార్చిలో రెండు ఓటీటీ మూవీస్ మొదలవుతాయి’ అని తెలిపారు శైలేష్.