ఆపరేషన్‌ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిలవుతోందా?..ఈటల గెలుపుతో చేరికలుంటాయని జరిగిన ప్రచారం వట్టిదేనా?

ABN , First Publish Date - 2021-11-27T16:45:29+05:30 IST

లోక్‌సభలో నాలుగు స్థానాల్లో విజయం, ఉప ఎన్నికల్లో రెండు చోట్ల గెలుపుతో ఉనికిలోకి వచ్చిన బీజేపీ తెలంగాణలో తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే ధీమాలో ఉంది. ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగే క్రమంలో ఆపరేషన్‌ ఆకర్ష్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు

ఆపరేషన్‌ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిలవుతోందా?..ఈటల గెలుపుతో చేరికలుంటాయని జరిగిన ప్రచారం వట్టిదేనా?

ఆపరేషన్‌ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిలవుతోందా? ఈటల రాజేందర్‌ గెలుపుతో భారీ సంఖ్యలో చేరికలుంటాయని జరిగిన ప్రచారం వట్టిదేనా? బీజేపీలో చేరేందుకు ఎవరూ ముందుకు రావడం లేదా? లేదంటే వ్యూహాత్మక మౌనం పాటిస్తూ ఒకేసారి భారీగా కండువాలు కప్పేందుకు కేంద్ర నాయకత్వం ఆర్డర్స్‌ కోసం రాష్ట్ర నేతలు వేచి చూస్తున్నారా? అనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.


ఆపరేషన్‌ ఆకర్ష్‌పై బీజేపీ నేతల మౌనం!  

లోక్‌సభలో నాలుగు స్థానాల్లో విజయం, ఉప ఎన్నికల్లో రెండు చోట్ల గెలుపుతో ఉనికిలోకి వచ్చిన బీజేపీ తెలంగాణలో తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే ధీమాలో ఉంది. ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగే క్రమంలో ఆపరేషన్‌ ఆకర్ష్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. కొద్దిమంది నేతలేమో బీజేపీలో చేరేందుకు తహతహలాడుతున్నారనే లీకులు వస్తున్నాయి. మరికొందరు కీలకనేతలను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ నేతలు కోరుకున్న చోట్ల పోటీపై సీట్ల గ్యారంటీ ఇస్తున్నారనే ప్రచారం ఎక్కువైంది. హుజురాబాద్‌ ఉప ఎన్నిక తర్వాత బీజేపీలో భారీగా చేరికలుంటాయనే విశ్లేషణలు జోరుగా నడిచాయి. అయితే రాజేందర్‌ ఎమ్మెల్యేగా ఎన్నికై మాసం దగ్గరికివస్తుంటే చేరికలపై బీజేపీ నేతలు మౌనం పాటిస్తుండటంతో డివైడ్‌ టాక్‌ వస్తోంది.


బీజేపీలో చేరుతామన్న నేతలు సైలెంట్‌ అయ్యారా? 

టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నుంచి భారీగా చేరికలుంటాయని మీడియాకు వివిధ పార్టీల నేతల నుంచి, బీజేపీ నుంచి లీకులు వచ్చాయి. పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఈటల రాజేందర్‌, డీకే అరుణ, జితేందర్‌రెడ్డి సహా పలువురు నేతలు చేరికల బాధ్యతలు తీసుకుని తమతమ పాతపార్టీల్లోని మిత్రులతో చర్చలు జరుపుతున్నారనే టాక్‌ వచ్చింది. అయితే హుజురాబాద్ ఉప ఎన్నిక జరిగి నెల గడుస్తున్నా పేరున్న నేత ఏ ఒక్కరు కూడా పార్టీలో జాయిన్‌ కాకపోవడంపై బీజేపీ గ్రౌండ్‌ లెవల్‌ కార్యకర్తల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయనే మాటలు వినిపిస్తున్నాయి. గతంలో బీజేపీలో చేరుతామని అంతరంగికుల దగ్గర తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన నేతలు సైతం సైలెంట్ అయిపోయారనే టాక్‌వస్తోంది. 


హైకమాండ్‌ నుంచి ఆర్డర్స్‌ రావడం లేదా?..  

పార్టీలో చేరికలు లేకుండా పరిస్థితి గుంభనంగా ఉండటంపై కార్యకర్తల్లో ఆందోళనలు వ్యక్తమవుతుంటే అగ్రస్థాయి నేతలకు హైకమాండ్‌ నుంచి వచ్చే ఇండికేషన్లు వేరే విధంగా ఉన్నట్లు మరో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికిప్పుడు చేరికలు ఎక్కువైపోతే తాజా నేతలకు, ఇప్పటికే ఉన్న నేతలకు మధ్య గ్యాప్‌ పెరిగి సర్దుబాట్ల సమస్య ఏర్పడుతుందనే ఆలోచనలో రాష్ట్ర పార్టీ ఉందనే టాక్‌ వస్తోంది. ఇతర పార్టీల నేతలతో సంప్రదింపులు జరుగుతున్నాయని, కొంతమంది చేరికలపై పార్టీ కూడా మాట ఇచ్చిందని సమయం కుదిరినప్పుడు గ్రాండ్‌ వెల్‌కమ్స్‌ ఉంటాయనే మాటలు వినిపిస్తున్నాయి. జిల్లా స్థాయి నేతలు, రాష్ట్రస్థాయి నేతలు, కేంద్రస్థాయి నేతలు ఇలా వర్గీకరణ చేసుకుని  హైకమాండ్‌కు లిస్ట్‌ చేరుకున్నాక అక్కడి నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావాల్సి ఉంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తొందరపాటు అవసరం లేదని టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ప్రజలు ఫిక్స్‌ అయిపోయినందున టెన్షన్‌ లేకుండా  వ్యూహాత్మకంగా వలసనేతలకు కండువా కప్పాలని బీజేపీ హైకమాండ్ సూచించినట్లు టాక్‌.

Updated Date - 2021-11-27T16:45:29+05:30 IST