House arrest వద్దు... నన్ను జైలుకే పంపండి.... ఓ భర్త విజ్ఞప్తి

ABN , First Publish Date - 2021-10-27T07:08:48+05:30 IST

ఎంతపెద్ద తప్పు చేసిన వాళ్లైనా సరే.. జైలుకెళ్లడానికి ఇష్టపడరు. కానీ అల్బేనియాకు చెందిన ఓ భర్త మాత్రం తనను జైలుకు..

House arrest వద్దు... నన్ను జైలుకే పంపండి.... ఓ భర్త విజ్ఞప్తి

ఇంటర్నెట్ డెస్క్: ఎంతపెద్ద తప్పు చేసిన వాళ్లైనా సరే.. జైలుకెళ్లడానికి ఇష్టపడరు. కానీ అల్బేనియాకు చెందిన ఓ భర్త మాత్రం తనను జైలుకు పంపించాలని వేడుకున్నాడు. ప్రస్తుతం హౌస్ అరెస్ట్‌లో ఉన్న అతడు.. తనను ఎలాగైనా జైలుకు మార్చాలని, ఇంట్లో దారుణమైన నరకం అనుభవిస్తున్నానని ఓ భర్త పోలీసులను అర్థించాడు. అతడి మాటలకు అవాక్కయిన పోలీసులు అతడి గురించి తెలుసుకున్నారు. చివరిగా కోర్టు ముందు ప్రవేశపెట్టారు.


వివరాల్లోకి వెళితే.. రోమ్‌లోని గుయ్‌డోనియా మంటేసిలియో ప్రాంతంలో 30 ఏళ్ల అల్బేనియన్ వ్యక్తి మాదకద్రవ్యాల కేసులో అరెస్టై.. కొద్ది నెలలుగా హౌస్ అరెస్ట్‌లో ఉన్నాడు. కానీ ఇటీవల అతడు ఇంటి నుంచి పారిపోయాడు. హౌస్ అరెస్ట్ నిబంధనలను అతిక్రమించినందుకుగానూ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. 


అప్పుడే పోలీసులకు అసలు విషయం తెలిసింది. అతడు కావాలనే ఇంటి నుంచి పారిపోయాడు. ముందుగా నిర్ధారించుకునే పోలీసులకు చిక్కిపోయాడు. అదేంటని అడిగితే.. ‘నా వల్ల కాదు. నేను ఇక ఇంట్లో ఉండలేను. నన్ను జైల్లో పెట్టండి’ అని అధికారులను కోరాడు. అయితే అతడి విన్నపం గురించి పట్టించుకోకపోయినా.. నిబంధనలను అతిక్రమించినందుకుగానూ న్యాయస్థానం అతడిని జైలుకు మార్చాలని ఆదేశించింది.


Updated Date - 2021-10-27T07:08:48+05:30 IST