Abn logo
Mar 30 2021 @ 19:52PM

మాఫియా డాన్ పోలీసులకు భలే దొరికిపోయాడు..! వంట చేయాలన్న ఉబలాటమే కొంపముంచింది!

ఇంటర్నెట్ డెస్క్: అతడో ప్రమాదకర గ్యాంగస్టర్.. ఆదేశంలోనే అత్యంత కిరాతకమైన మాఫియాకు అధినేత..! ఆరేళ్ల క్రితం అతడి అరెస్టుకు వారెంట్ జారీ అయింది. ఇన్నాళ్లకు అతడు పోలీసులకు చిక్కాడు. ఇక్కడున్న ట్విస్ట్ ఏంటంటే..ఆ గ్యాంగ్‌స్టర్‌కు వంటలు చేయడమంటే మహా ఇష్టం. అందుకే అండర్ గ్రౌండ్‌లో ఉన్నప్పటికీ..వంటల వీడియోలు చేసి యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేసేవాడు. అదే ఇప్పుడు అతడు పోలీసులకు చిక్కేలా చేసింది. ఏంటి నమ్మకం కలగట్లేదు కదూ.. కానీ మీరు నమ్మితీరాల్సిందే. ఇదేమీ ఫన్నీ స్కిట్ కాదు. తెలుగు సినిమాల్లో కనిపించే కామెడీ సైడ్ ట్రాక్ అంతకన్నా కాదు. నిజజీవితంలో జరిగిన ఘటన ఇది. సదరు గ్యాంగ్‌స్టర్ పేరు మార్క్ ఫెరెన్ క్లాడ్ బియార్ట్(53). ఒకప్పుడు ఇటలీ పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన చరిత్ర అతడిది.

2014లోనే ఇటలీలోని స్థానిక కోర్టు అతడి అరెస్టుకు వారెంట్ జారీ చేసింది. ఆ తరువాత మనోడు భార్యతో డొమినికన్ రిపబ్లిక్‌కు పారిపోయాడు. అప్పటి నుంచీ అక్కడే మకాం. అయితే.. అక్కడ కూడా వేల సంఖ్యలోనే ఇటలీ జాతీయులు ఉన్నారు. అందుకే వారి దృష్టిని ఆకర్షించకుండా ఉండేందుకు పక్కగా నటించేవాడు. తన వివరాలేవీ బయటపెట్టేవాడు కాదు. అక్కడున్న వారు ఇతగాడిని ఓ విదేశీ వ్యక్తి అనుకుని వదిలేశేవారు. కానీ..అతడి వంటల వీడియోలు చూసి పోలీసులు ఆచూకీ పట్టేశారు. వాస్తవానికి అతడు వీడియోల్లో మొహం కనిపించకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. కానీ.. చేతులపై ఉన్న టాటూలను మాత్రం దాచడం మర్చిపోయాడు. అదే అతడి కొంపు ముంచింది. అతడి కోసం డేగ కళ్లేసుకుని వెతుకుతున్న పోలీసులు..ఈ వీడియో ద్వారా గ్యాంగస్టర్‌ను కటకటాల వెనక్కి నెట్టేశారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement