సీడెడ్ల హవా

ABN , First Publish Date - 2020-09-18T09:08:15+05:30 IST

ఫ్రెంచ్‌ ఓపెన్‌కు సన్నాహకమైన ఇటాలియన్‌ ఓపెన్‌లో స్టార్ల జోరు కొనసాగుతోంది.

సీడెడ్ల హవా

 స్విటోలినా ముందంజ

ఇటాలియన్‌ ఓపెన్‌ 


రోమ్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌కు సన్నాహకమైన ఇటాలియన్‌ ఓపెన్‌లో స్టార్ల జోరు కొనసాగుతోంది. మహిళల సింగిల్స్‌లో నాలుగోసీడ్‌ స్విటోలినా, తొమ్మిదో సీడ్‌ గార్బినె ముగురుజ మూడోరౌండ్‌కు దూసుకెళ్లారు. రెండోరౌండ్లో స్విటోలినా (ఉక్రెయిన్‌) 6-3. 7-6 (7/4)తో రష్యాకు చెందిన అనస్తీసియా పావ్‌ల్యుచెన్‌కోవాపై, ముగురుజ (సెర్బియా) 7-6 (7/3), 3-6, 6-3తో అమెరికా యువ కెరటం కొకొ గాఫ్‌పై గెలుపొందారు. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ రఫెల్‌ నడాల్‌, సెర్బియా హీరో నొవాక్‌ జొకోవిచ్‌ మూడోరౌండ్లోకి ప్రవేశించారు. తొమ్మిదిసార్లు విజేత నడాల్‌ 6-1, 6-2తో సహచరుడు పాబ్లో కరెనో బుస్టాపై, జొకోవిచ్‌ 6-3, 6-2తో వైల్డ్‌కార్ట్‌ ఎంట్రీ ఆటగాడు సాల్వటోర్‌ కరుసోపై విజయం సాధించారు.  

Updated Date - 2020-09-18T09:08:15+05:30 IST