సరిహద్దుల్లోని హిమాలయాలపై ITBP జవాన్ల Yoga

ABN , First Publish Date - 2022-06-21T14:56:35+05:30 IST

అంతర్జాతీయ సరిహద్దుల్లోని హిమాలయా పర్వతాలపై మంగళవారం ఉదయం ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) జవాన్లు యోగాసనాలు వేశారు....

సరిహద్దుల్లోని హిమాలయాలపై ITBP జవాన్ల Yoga

శ్రీనగర్: అంతర్జాతీయ సరిహద్దుల్లోని హిమాలయా పర్వతాలపై మంగళవారం ఉదయం ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) జవాన్లు యోగాసనాలు వేశారు. 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అస్సాంలతో సహా భారత్-చైనా సరిహద్దుల్లో ఐటీబీపీ జవాన్లు యోగా చేశారు.లడఖ్ ప్రాంతంలోని 17వేల అడుగుల ఎత్తున్న హిమాలయాలపై ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు యోగా చేశారు.ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసుకి చెందిన హిమ్‌వీర్లు సిక్కింలో మంచు పరిస్థితుల్లో 17,000 అడుగుల ఎత్తులో యోగా సాధన చేశారు.


అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఐటీబీపీ ఓ పాటను కూడా అంకితం చేసింది.గౌహతిలోని లచిత్ ఘాట్ వద్ద బ్రహ్మపుత్ర నదికి ఎదురుగా ఐటీబీపీ 33 బెటాలియన్ జవాన్లు యోగా సెషన్ నిర్వహించారు.లోహిత్‌పూర్‌లో అరుణాచల్ ప్రదేశ్ యొక్క తూర్పు కొన వద్ద ఉన్న హిమ్‌వీర్లు గుర్రాలతో యోగా సాధన చేశారు.


Updated Date - 2022-06-21T14:56:35+05:30 IST