Abn logo
May 4 2021 @ 23:43PM

ఆర్థిక సమస్యలతో ఐటీడీఏ ఉద్యోగి మృతి

పార్వతీపురం, మే 4: ఐటీడీఏ కార్యాలయంలో డైలీవేస్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పీవీ సూర్యనారాయణ (సూర్యం) సోమవారం రాత్రి మృతి చెం దారు. ఐటీడీఏలో 15 ఏళ్లుగా పనిచేస్తున్న సూర్యనారాయణ గత కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. సుమారు 18 నెలలుగా ఐటీడీఏ నుంచి జీతాలు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి సూర్యనారాయణ మృతి చెందినట్టు సామాజికమాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై ఐటీడీఏ పీవో ఆర్‌.కూర్మనాథ్‌ వివరణ కోరగా 16 నెలలుగా ఐటీడీఏలో కొంతమందికి జీతాలు అందడం లేదన్న విషయం తన దృష్టికి వచ్చిందని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ గిరిజన సంక్షేమ ఉన్నతాధికారులకు లేఖ రాశానన్నారు. కానీ ప్రత్యేక నిధులు రాకపోవడంతో ఐటీడీఏలో ఉన్న నిధుల నుంచి ముందుగా ఏడు నెలల జీతం మంజూరు చేశామన్నారు. సూర్యనారాయణ అనారోగ్యంతో మృతి చెందారని, గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని, దీనికి తోడు కరోనా వ్యాధి సోకడంతో అనారోగ్యంతో మృతి చెందారని తెలిపారు. 

 

Advertisement
Advertisement
Advertisement