భవన నిర్మాణాల్లో జాప్యంపై ఐటీడీఏ పీవో ఆగ్రహం

ABN , First Publish Date - 2021-01-21T06:32:16+05:30 IST

పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్‌ వెంకటేశ్వర్‌ బుధవారం మండలంలో పర్యటించారు. తొలుత ఇక్కడి పీహెచ్‌సీని సందర్శించి కొవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రక్రియను పరిశీలించారు.

భవన నిర్మాణాల్లో జాప్యంపై ఐటీడీఏ పీవో ఆగ్రహం
గుంటసీమ ఆశ్రమ పాఠశాలలో నాడు-నేడు పనులు పరిశీలిస్తున్న ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్‌

 చాపరాయి జలపాతంలో ప్రమాదాలు నివారించాలని సూచన


డుంబ్రిగుడ, జనవరి 20: పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్‌ వెంకటేశ్వర్‌ బుధవారం మండలంలో పర్యటించారు. తొలుత ఇక్కడి పీహెచ్‌సీని సందర్శించి కొవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం  గుంటసీమ వెళ్లిన ఆయన గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో నాడు-నేడు పనులు, పాఠశాల అదనపు భవనం, గ్రామ సచివాలయం,, రైతు భరోసా కేంద్రం భవన నిర్మాణ పనులను తనిఖీ చేశారు. పనులు మందకొడిగా సాగుతున్నాయంటూ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తరువాత చాపరాయి జలపాతాన్ని సందర్శించి, ఇక్కడ తరచూ పర్యాటకులు ఎందుకు మృతిచెందుతున్నారంటూ సిబ్బందిని ఆరా తీశారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని, పరిసరాలను పరిశుభ్రంగా వుంచాలని నిర్వాహకులను ఆదేశించారు. పీవో వెంట ఎంపీడీవో ఛాయసుధ, వివిధ శాఖల అధికారులు వున్నారు.


Updated Date - 2021-01-21T06:32:16+05:30 IST