Advertisement
Advertisement
Abn logo
Advertisement

యానాదులకు ప్రత్యేక ఆధార కేంద్రాలు

కావలి, డిసెంబరు 6: యానాదులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, అందులో భాగంగా ఆధార్‌కార్డు లేని వారిని గుర్తించి ఐటీడీఏ ఆధ్వర్యంలో ఆధార్‌ కార్డులు ఇప్పించేందుకు ప్రత్యేక ఆధార్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ఐటీడీఏ ఐటీ విభాగం ప్రత్యేక అధికారి కిరణ్‌కుమార్‌ తెలిపారు. కావలి జర్నలి్‌స్టక్లబ్‌లో సోమవారం ఆయన కొంతమంది యానాదులకు ఆధార్‌ కార్డులు అందచేశారు. అనంతరం మాట్లాడుతూ నెల్లూరు ఐటీడీఏ పీవో  కనకదుర్గా భవానీ ఆదేశాల మేరకు గిరిజన ప్రాంతాలకు వెళ్లి ఆధార్‌లేని వారిని గుర్తించి వారికి ఆధార్‌ కార్డులను ఇప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కావలి ప్రాంతంలో బుడంగుంట కాలనీ, అడవిరాజు పాలెం, కావేరిగుంట, జొన్నాయిగుంట ప్రాంతాల్లో 72 మంది యానాదులకు ఆధార్‌ కార్డులు పోస్టల్‌ సర్వీస్‌ ద్వారా మంజూరు చేయించి వారికి అందజేశామన్నారు. వారు నివసించే ప్రాంతాలను వలంటీర్ల ద్వారా మ్యాపింగ్‌ చేయించి సచివాలయాల్లో వారి పేర్లు నమోదు చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యానాదుల సేవాసంఘ రాష్ట్ర అధ్యక్షురాలు చేవూరు పద్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement