Abn logo
Jun 17 2021 @ 18:14PM

ఐటీఐ... ఫుల్ జోష్...

ముంబై : నాలుగు నెలల తర్వాత ఐటీఐలో ఫుల్‌ జోష్ కనిపిస్తోంది. ఈ రోజు ఈ స్టాక్‌ ఇంట్రాడేలో ఏడు శాతానికి పైగా లాభపడి ‘డే’ గరిష్ట స్థాయి రూ. 137.65 కు చేరింది. ప్రస్తుతం మూడున్నర శాతం లాభంతో రూ. 132.70 వద్ద షేర్‌ ట్రేడవుతోంది. ఈ రోజు...


ఇప్పటివరకు ఎన్‌ఏస్‌ఈలో దాదాపు 23 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ. 12,392 కోట్లకు పెరిగింది. ఈ కౌంటర్‌లో డైలీ యావరేజ్‌తో పోలిస్తే గురువారం ఐదు రెట్లు పెరిగాయి. పోటీ కంపెనీలతో పోలిస్తే ఈ స్టాక్‌ బెస్ట్‌ పెర్ఫామర్‌గా ఉంది. గత 52 వారాల్లో ఈ స్టాక్‌ 57 శాతం లాభపడి ఇన్వెస్టర్లను మురిపించింది.