వ్యాక్సిన్ మిక్సింగ్‌..ఇదో ప్రమాదకర ట్రెండ్: డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్

ABN , First Publish Date - 2021-07-13T04:54:34+05:30 IST

ప్రజలు తమంతట తాముగా రెండు వేర్వేరు టీకాలు తీసుకోవాలని నిర్ణయించడమనేది( వ్యాక్సిన్ మిక్సింగ్) కొంత ప్రమాదకర వైఖరి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ డా. సౌమ్య స్వామినాథన్ తాజాగా పేర్కొన్నారు.

వ్యాక్సిన్ మిక్సింగ్‌..ఇదో ప్రమాదకర ట్రెండ్: డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్

జెనీవా: ప్రజలు తమంతట తాముగా రెండు వేర్వేరు టీకాలు తీసుకోవాలనే నిర్ణయానికి రావడం( వ్యాక్సిన్ మిక్సింగ్) కొంతవరకూ ప్రమాదకరమైన వైఖరి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ డా. సౌమ్య స్వామినాథన్ తాజాగా పేర్కొన్నారు. ‘‘టీకా మిక్సింగ్‌కు సంబంధించినంత వరకూ మనం ఎటువంటి సమాచారం, ఆధారాలు అందుబాటులో లేని పరిస్థితిలో ఉన్నాం. కరోనా టీకా రెండో డోసు..మూడో డోసు..నాలుగో డోసు.. ఇలా ఏది, ఎప్పుడు తీసుకోవాలో ప్రజలు తమతంట తాముగా నిర్ణయించుకుంటే గందరగోళం ఏర్పడుతుంది’’ అని ఆమె హెచ్చరించారు. వేర్వేరు టీకా డోసులు ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం చూపుతాయో తెలిపే సమాచారం ఏదీ ప్రస్తుతం అందుబాటులో లేదని డా. సౌమ్య పేర్కొన్నారు.   

Updated Date - 2021-07-13T04:54:34+05:30 IST