రెక్కలు విప్పుకున్న గరుడ పక్షిలా..

ABN , First Publish Date - 2021-05-18T06:53:03+05:30 IST

తిరుపతి నగరంలో నిర్మాణంలో ఉన్న గరుడవారధి రోజు రోజుకీ ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంటోంది. కొర్లగుంట నుంచి మూడు వరసల్లో విస్తరిస్తూ తిరుమల బైపాస్‌ రోడ్డు మొత్తాన్నీ ఆ ప్రాంతంలో పందిరిలా కప్పేస్తోంది.

రెక్కలు విప్పుకున్న గరుడ పక్షిలా..
సుపర్ణుడి రెక్కలను పోలివున్న గరుడవారధి

తిరుపతి(కొర్లగుంట), మే 17: తిరుపతి నగరంలో నిర్మాణంలో ఉన్న గరుడవారధి రోజు రోజుకీ ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంటోంది. కొర్లగుంట నుంచి మూడు వరసల్లో విస్తరిస్తూ తిరుమల బైపాస్‌ రోడ్డు మొత్తాన్నీ ఆ ప్రాంతంలో పందిరిలా కప్పేస్తోంది. శ్రీనివాసం దాకా ఇక్కడ అటూ ఇటూ భవనాలను ఒరుసుకుంటున్నట్టుగా వారధి సాగుతోంది.  వంతెన మీద తిరుమల యాత్రికుల వాహనాలు దూసుకుపోతూ ఉంటే, వంతెన కింద స్థానిక ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా సాగేలా ప్లాన్‌ చేశారు. ఇక్కడ నిర్మాణంలో ఉన్న గరుడవారధిని కింది నుంచి చూస్తే రెక్కలు విప్పుకున్న గరుడపక్షిలా కనిపిస్తోంది. వంతెన మూడు వరుసలుగా సాగుతున్న ప్రాంతంలో ఆకాశం కనిపించకుండా, ఎండ పొడ నేలను తాకకుండా వారధి కప్పేస్తోంది. వేసవి వేడి సెగలతో నెత్తిమాడిపోతూ ప్రయాణిస్తున్నవారు ఈ ప్రాంతంలో వంతెన కిందికి రాగానే వెలుగు మందగించి, చల్లని వింత వాతావరణాన్ని  అనుభవిస్తున్నారు. ఆధునిక యంత్రాలతో సాగుతున్న గరుడవారధి నిర్మాణాన్ని వీక్షిస్తూ మాట్లాడుకుంటున్నారు.  

Updated Date - 2021-05-18T06:53:03+05:30 IST