Abn logo
Jun 23 2021 @ 22:11PM

జమ్ముకశ్మీర్ సమస్యను పరిష్కరించేది ఢిల్లీ , ఇస్లామాబాద్ కాదు: అల్తాఫ్ బుఖారీ

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ విషయంలో పాకిస్థాన్‌తో సంప్రదింపులు జరపాలన్న మహబూబా మఫ్తీ పిలుపుపై అప్నీ పార్టీ నేత అల్తాఫ్ బుఖారీ ఘాటుగా స్పందించారు. ‘‘ఈ సమస్యను పరిష్కరించేది ఢిల్లీ.. ఇస్లాబాద్ లేదా వాషింగ్టన్ కాదు’’ అని ఆయన కామెంట్ చేశారు. మహబూబా మఫ్తీ తనకు అవకాశం చిక్కినప్పుడల్లా మాట్లాడే అజెండాలో ఈ విధానం భాగమై ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కశ్మీర్ విషయంలో పాక్‌తోనూ చర్చలు జరపాలన్న మఫ్తీ కామెంట్ పెద్ద చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఇక కశ్మీర్‌కు సంబంధించిన అంశాలన్నీ దేశ అంతర్గత వ్యవహారాలుగా పరిగణించాలనేది భారత్ ఎప్పటినుంచో అనుసరిస్తూ వస్తున్న విధానం.