ఆర్టీసీలో మళ్లీ జేఏసీ

ABN , First Publish Date - 2021-06-13T09:25:15+05:30 IST

కొంత కాలంగా స్తబ్ధుగా ఉన్న ఆర్టీసీలో యూనియన్లలో మళ్లీ కదలిక మొదలైంది.

ఆర్టీసీలో మళ్లీ జేఏసీ

  • సమస్యలపై పోరాటాలకు 8 సంఘాలతో కమిటీ
  • శనివారం తొలి సమావేశం.. 20న మరోసారి భేటీ
  • అన్ని సంఘాలను జేఏసీలోకి ఆహ్వానించాలని నిర్ణయం 


హైదరాబాద్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): కొంత కాలంగా స్తబ్ధుగా ఉన్న ఆర్టీసీలో యూనియన్లలో మళ్లీ కదలిక మొదలైంది. రెండేళ్ల పాటు యూనియన్లను రద్దు చేస్తున్నామంటూ సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటన తో సంఘాలు కొంత మౌనం వహించాయి. దీంతో ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఇలాగైతే ఉనికి కోల్పోవాల్సి వస్తుందన్న ఆలోచనతో యూనియన్లు మళ్లీ క్రియాశీలమవుతున్నాయి. ఈ మేరకు చాలా కాలం తర్వాత 8యూనియన్లు జాయింట్‌ యాక్షన్‌ కమిటీ(జేఏసీ)గా ఏర్పాటయ్యాయి. ఎంప్లాయీస్‌ యూనియన్‌(ఈయూ), స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌(ఎ్‌సడబ్ల్యూఎఫ్‌), నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌(ఎన్‌ఎంయూ), స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌(ఎ్‌సడబ్ల్యూయూ),కార్మిక సంఘ్‌ (బీఎంఎస్‌), బహుజన కార్మిక యూనియన్‌(బీకేయూ), బహుజన వర్కర్స్‌ యూనియన్‌(బీడబ్ల్యూయూ), సామాజిక తెలంగాణ మజ్దూర్‌ యూ నియన్‌.. జేఏసీలో భాగస్వామ్యమయ్యాయి. 


ఈయూ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి అధ్యక్షతన జేఏసీ తొలి సమావేశం శనివారం జరిగింది. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. 2017 ఏప్రిల్‌ 1 నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ వేతనాలు, పీఆర్సీ నాలుగేళ్ల కాలపరిమితి ముగిసినా ఇప్పటికీ అమలు కావడం లేదని సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. సీసీఎ్‌సకు ఆర్టీసీ రూ.900 కోట్లు బకాయి పడినా చెల్లించడం లేదని విమర్శించింది. ఇలాంటి ప్రధాన సమస్యల పరిష్కారానికి పోరాటానికి కలిసి వచ్చే ఇతర సంఘాలను జేఏసీలోకి ఆహ్వానించాలని తీర్మానించింది. తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌(టీఎంయూ)తో పాటు తెలంగాణ జాతీయ మజ్దూర్‌ యూనియన్‌ (టీజేఎంయూ) వంటి సంఘాలను జేఏసీలో కలుపుకోవాలని నిర్ణయించింది.  ఈ నెల 20న మరోసారి సమావేశమై కార్యాచరణను రూపొందించుకోవాలని నిర్ణయించింది. 


వేతన సవరణను అమలు చేయాలి: టీఎంయూ

ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణను అమలు చేయడం హర్షణీయమని తెలంగాణ మజ్దూర్‌ యూ నియన్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి.తిరుపతి, ఏఆర్‌ రెడ్డి తెలిపారు. అయితే, అసెంబ్లీలో ప్రకటించినట్లుగానే ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వెంటనే వేతన సవరణను అమలు చేయాలని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు జూన్‌ 12గడిచిపోయినా.. ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలు అందలేదన్నారు. విద్యుత్తు సంస్థలో అమ లు చేసిన 35 శాతం ఫిట్‌మెంట్‌ వేతన సవరణను ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్‌ ఎం.నాగేశ్వరరావు కోరారు. 

Updated Date - 2021-06-13T09:25:15+05:30 IST