సమస్యలు పరిష్కరిస్తే ఉద్యమాలు ఉండవు

ABN , First Publish Date - 2020-10-22T09:43:21+05:30 IST

విద్యుత్‌ సంస్థల్లో యాజమాన్యానికి.. ఉద్యోగ సంఘాలకు మధ్య వాతావరణం వేడెక్కుతోంది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఆందోళన కార్యక్రమాలకు

సమస్యలు పరిష్కరిస్తే ఉద్యమాలు ఉండవు

ట్రాన్స్‌కో సీఎండీకి ఉద్యోగ జేఏసీ ప్రత్యుత్తరం


అమరావతి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ సంస్థల్లో యాజమాన్యానికి.. ఉద్యోగ సంఘాలకు మధ్య వాతావరణం వేడెక్కుతోంది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఆందోళన కార్యక్రమాలకు పూనుకోవద్దని ట్రాన్స్‌కో సీఎండీ నాగులపల్లి శ్రీకాంత్‌ రాసిన లేఖకు ఉద్యోగ జేఏసీ బుధవారం ప్రత్యుత్తరం పంపింది. తమ సమస్యలను ఆమోదయోగ్యంగా పరిష్కరిస్తే ఆందోళనలు చేయాల్సిన అవసరం ఉండదని అందులో పేర్కొంది. ఉద్యోగ జేఏసీ అధ్యక్షుడు పి. చంద్రశేఖర్‌, సెక్రటరీ జనరల్‌ ఎం.వేద వ్యాసరావు, కన్వీనర్‌ బి.సాయికృష్ణ ఈ మేరకు లేఖను పంపారు. అపరిష్కృత సమస్యలపై ఈ నెల 19వ తేదీ నుం చి దశలవారీ ఆందోళనకు జేఏసీ పిలుపునిచ్చింది. వరదలతో విద్యుత్‌ సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తమైన ప్రస్తుత పరిస్థితుల్లో ఆందోళన వద్దంటూ సీఎండీ వారికి లేఖ రాశారు. కాగా, సంప్రదింపుల ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నామని ట్రాన్స్‌కో సీఎండీ నాగులపల్లి శ్రీకాంత్‌  చెప్పా రు. మరోవైపు సబ్‌ స్టేషన్లలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ నవంబరు 13న విద్యుత్‌ సంస్థల ప్రధాన కార్యాలయం ముందు సా మూహిక రాయబారం పేరుతో ఆందోళన నిర్వహించనున్నట్లు యునైటెడ్‌ విద్యుత్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.బాలకాశి చెప్పారు. ఈ మేరకు ట్రాన్స్‌కో సీఎండీని కలిసి వినతిపత్రం ఇచ్చారు.

Updated Date - 2020-10-22T09:43:21+05:30 IST