నాగేశ్వర్‌కు నిర్మాణ కార్మిక సంఘాల జేఏసీ మద్దతు

ABN , First Publish Date - 2021-03-08T07:55:56+05:30 IST

హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వంతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌కు రాష్ట్ర భవననిర్మాణ, ఇతర నిర్మాణ కార్మిక సంఘాల జేఏసీ మద్దతు పలికింది.

నాగేశ్వర్‌కు నిర్మాణ కార్మిక సంఘాల జేఏసీ మద్దతు

హైదరాబాద్‌, మార్చి7 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వంతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌కు రాష్ట్ర భవననిర్మాణ, ఇతర నిర్మాణ కార్మిక సంఘాల జేఏసీ మద్దతు పలికింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ఎం.ప్రవీణ్‌కుమార్‌ గౌడ్‌, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు వంగూరు రాములు,  ప్రధాన కార్యదర్శి ఆర్‌.కోటంరాజు, ఐఎ్‌ఫటీఏ అధ్యక్షుడు అన్వేష్‌, ఐఎ్‌ఫటీయూ ప్రధాన కార్యదర్శి అనూరాధ తదితరులు సమావేశమై నాగేశ్వర్‌కు మద్దతు ప్రకటించాలని నిర్ణయించారు.  

Updated Date - 2021-03-08T07:55:56+05:30 IST