న్యూజిలాండ్‌ ప్రధానిగా రెండోసారి ఎన్నికైన జసిండా

ABN , First Publish Date - 2020-10-18T11:39:13+05:30 IST

న్యూజిలాండ్‌ ప్రధానిగా జసిండా ఆర్డెర్నో రెండోసారి ఎన్నికయ్యారు. ఆమె నేతృత్వంలోని లిబరల్‌ లేబర్‌ పార్టీ

న్యూజిలాండ్‌ ప్రధానిగా రెండోసారి ఎన్నికైన జసిండా

  • 49% ఓట్లతో అపూర్వ విజయం.. కొవిడ్‌ కట్టడిలో సర్వత్రా ప్రశంసలు

ఆక్లండ్‌, అక్టోబరు 17: న్యూజిలాండ్‌ ప్రధానిగా జసిండా ఆర్డెర్నో రెండోసారి ఎన్నికయ్యారు. ఆమె నేతృత్వంలోని లిబరల్‌ లేబర్‌ పార్టీ 49 శాతం ఓట్లు సాధించగా, కన్జర్వేటివ్‌ పార్టీ కేవలం 27 శాతం ఓట్లనే పొందగలిగింది. జసిండా ఎన్నిక ఊహించినదే అయినా ఇంతటి భారీ మెజారిటీ వస్తుందని ఎవరూ భావించలేదు. గత 50 ఏళ్లలో ఎన్నడూ ఏ నేతా ఇంత పాపులారిటీని సాధించ లేదు. దామాషా ప్రాతిపదికన జరిగే ఎన్నికల్లో సాధారణంగా పార్టీలు ఎన్నికలకు ముందే వేరే పార్టీతో పొత్తు కుదుర్చుకుంటాయి. కానీ ఈసారి లేబర్‌ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగింది. ఒంటిచేత్తో జసిండా లేబర్‌ పార్టీని విజయతీరాలకు చేరుస్తారన్న నమ్మకంతో పార్టీవాదులు పొత్తులు పెట్టుకోలేదు. జసిండా కూడా వారి నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఆమె ప్రచారానికి వెళ్లినపుడు ఓ రాక్‌స్టార్‌ను చూసినట్లుగా ప్రజలు వేలంవెర్రిగా ఆమె సభలకు హాజరై జయజయధ్వానాలు చేసినపుడే ఆమె విజయం ఖరారైందని మీడియా వ్యాఖ్యానించింది. 

Updated Date - 2020-10-18T11:39:13+05:30 IST