Advertisement

ట్విట్టర్ సీఈవోగా జాక్ రిజైన్.. కౌంటర్ ఇచ్చిన Kangana Ranaut

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ చాలా విషయాలపై ఎలాంటి బెరుకు లేకుండా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ఉంటుంది. దీని వల్ల చాలా సార్లు కాంట్రవర్సీలో ఇరుక్కుంటూ ఉంటుంది ఈ తార. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది ఈ భామ.


ప్రస్తుతం బాగా బజ్ క్రియేట్ చేసిన వార్తల్లో ట్విట్టర్ సీఈవోగా జాక్ డోర్సే రిజైన్ చేయగా.. ఆయన స్థానంలో ఇండో అమెరికన్ పారగ్ అగర్వాల్ కొత్త సీఈవోగా నియమితులయ్యాడనేది ఒకటి. దీనిపై ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించింది కంగనా. ‘బై చాచా జాక్’ అంటూ స్టోరీ పెట్టింది. ఈ విషయంపై స్పందించిన బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ సైతం.. ‘ఇది హిందుస్తానీ సోదరా. ఏదైనా జరగొచ్చు. అందుకే పారాగ్ సీఈవో అవుతున్నాడం’టూ కామెంట్ పెట్టాడు. సోనమ్ కపూర్ కూడా జాక్ రిజైన్ ట్వీట్‌ని రీ ట్వీట్ చేసింది.

అయితే బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్స్ గురించి వరుసగా ట్వీట్ పెట్టింది కంగనా. దీంతో వారి నిబంధనలకు విరుద్ధంగా వివాదాస్పద, గొడవలను పెంచేలా ఉన్నాయంటూ ఈ బ్యూటీ అకౌంట్‌ని ఈ ఏడాది మే 3న శాశ్వతంగా నిషేధించింది ట్వీట్టర్ యాజమాన్యం. అంతేకాకుండా అనుపమ్ ఖేర్, సోనమ్ కపూర్ అకౌంట్స్‌ని కూడా తాత్కాలికంగా నిలిపివేసి తర్వాత పునరుద్ధరించింది. దీంతో దీనికి కౌంటర్‌గానే ఈ స్టోరీని పెట్టినట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Advertisement

Bollywoodమరిన్ని...