జడేజా అదిరిపోయే త్రో.. పంజాబ్ కెప్టెన్ అవుట్

ABN , First Publish Date - 2021-04-17T01:23:32+05:30 IST

చెన్నై ఆటగాడు రవీంద్ర జడేజా మరోసారి తన ఫీల్డింగ్ మ్యాజిక్ చూపించాడు. అదిరిపోయే త్రో విసిరి పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను అవుట్ చేశాడు. దీపక్ చాహర్ విసిరిన..

జడేజా అదిరిపోయే త్రో.. పంజాబ్ కెప్టెన్ అవుట్

ముంబై: చెన్నై ఆటగాడు రవీంద్ర జడేజా మరోసారి తన ఫీల్డింగ్ మ్యాజిక్ చూపించాడు. అదిరిపోయే త్రో విసిరి పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను అవుట్ చేశాడు. దీపక్ చాహర్ విసిరిన బంతిని ఫ్లాక్ చేయబోయిన గేల్.. మిస్ అయ్యాడు. ఆ బంతి ప్యాడ్‌కు తగలడంతో బౌలర్ ఎల్‌బీడబ్ల్యూ అపీల్ చేశాడు. ఇంతలో గేల్ సింగిల్‌కు రావడంతో, అవతలి ఎండ్‌లో ఉన్న రాహుల్ కూడా పరిగెత్తాడు. అయితే ఇంతలో పాయింట్ రేంజ్‌లో ఉన్న జడేజా.. మెరుపు వేగంతో బంతిని అందుకుని వికెట్లకు విసిరాడు. ఆ బంతి నేరుగా వికెట్లను గిరాటేసింది. దీంతో రాహుల్(5: 7 బంతుల్లో.. 1 ఫోర్) పెవిలియన్ బాట పట్టాడు. ప్రస్తుతం క్రిస్ గేల్(9: 7 బంతుల్లో), దీపక్ హుడా(0) క్రీజులో ఉన్నారు. 2.5 ఓవర్లలో పంజాబ్ 2 వికెట్లకు 15 పరుగులతో ఉంది.

Updated Date - 2021-04-17T01:23:32+05:30 IST