Advertisement
Advertisement
Abn logo
Advertisement

మద్యపాన నిషేధంపై జగన్‌ క్లారిటీ ఇవ్వాలి: రఘురామ

ఢిల్లీ: మద్యపాన నిషేధంపై సీఎం జగన్‌ క్లారిటీ ఇవ్వాలని ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మద్య నిషేధం చేయకపోతే ఓట్లు అడగనని ఎన్నికల్లో జగన్‌ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. మద్యంపై ఆదాయాన్ని తాకట్టు పెట్టి రుణాలు తెస్తున్నారని విమర్శించారు. ఇక మద్యపాన నిషేధం సాధ్యం కాదని భావించాలా? అని రఘురామ ప్రశ్నించారు. మరి వచ్చే ఎన్నికల్లో జగన్‌ ఓట్లు అడగరా అని నిలదీశారు. ఎన్నికల్లో జగన్‌ ఓట్లు అడుగుతారా..లేదా? స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్‌ లెక్చరర్లను ఏపీ ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఎయిడెడ్‌ స్కూళ్లపై వైసీపీ నేతల వింత పోకడలు పోతున్నారని తప్పుబట్టారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ఎయిడెడ్‌ స్కూళ్లను నాశనం చేయొద్దని సూచించారు. సంఖ్యాబలం లేకపోయినా సీపీఐ, టీడీపీ నేతల పోరాటం చిరస్మరణీయమని రఘురామకృష్ణరాజు కొనియాడారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement