Advertisement
Advertisement
Abn logo
Advertisement

జగన్ ఆస్తుల కేసులో శ్రీనివాస్ రెడ్డి పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసుల పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. హెటిరో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి క్వాష్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. పెట్టుబడుల సేకరణలో జగన్ , విజయసాయి రెడ్డి కీలక పాత్ర పోషించారని న్యాయస్థానం ముందు సీబీఐ మరోసారి వాదనలు వినిపించింది. వైఎస్ సీఎం‌గా ఉన్న సమయంలో తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లబ్ది చేకూర్చారని సీబీఐ తెలిపింది. పెట్టుబడుల రూపంలో పలువురు నుంచి ముడుపులు సేకరించారని, హెటిరో భూ కేటాయింపులకు , జగతి పబ్లికేషన్స్‌లో ఆ కంపెనీ పెట్టుబడులకు సంబంధం ఉందని సీబీఐ వాదనలు వినిపించింది. జగన్ ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండానే 1246 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు రాబట్టారని పేర్కొంది. హెటిరో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ప్రమేయంపై తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని.. అతనిపై కేసు కొట్టి వేయకండని ధర్మాసనానికి సీబీఐ తెలిపింది. హెటిరో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. వాన్ పిక్ కేసు నిందితుడు కేవీ బ్రహ్మానంద రెడ్డి క్వాష్ పిటిషన్‌ దాఖలు చేశారు. తనపై ఉన్న కేసును కొట్టివేయాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌పై విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement