Advertisement
Advertisement
Abn logo
Advertisement

జగన్ బెయిల్ రద్దుపై రఘురామ పిటిషన్ వెనక్కి

హైదరాబాద్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన  పిటిషన్‌ను హైకోర్టు రిజిస్ట్రీ సాంకేతిక కారణాలతో వెనక్కి ఇచ్చేసింది. దీంతో అన్ని ఆధారాలతో మరోసారి దాఖలు చేస్తామని రఘురామ తెలిపారు. జగన్‌పై ఉన్న 11 ఛార్జ్‌షీట్లపై సమగ్రమైన దర్యాప్తు చేయాలని,  జగన్ బెయిల్ రద్దు చేసి సీబీఐ విచారణ త్వరితగతిన జరిగేలా ఆదేశాలివ్వాలని అంతకుముందు రఘురామ కోరారు. గతంలో జగన్ బెయిల్ రద్దు చేయాలని వేసిన పిటిషన్‌ను నాంపల్లి సీబీఐ కోర్టు కొట్టి వేసింది. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement