జగన్ బెయిల్ రద్దు కేసులో సీబీఐ తడబడుతోందా?

ABN , First Publish Date - 2021-07-27T01:05:17+05:30 IST

జగన్ బెయిల్ రద్దు కేసులో సీబీఐ తడబడుతోందా?

జగన్ బెయిల్ రద్దు కేసులో సీబీఐ తడబడుతోందా?

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సోమవారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. లిఖితపూర్వక వాదనలు సమర్పించడానికి మరింత గడువు కావాలని సీబీఐ అధికారులు కోరారు. సీబీఐ తరఫున వాదించే పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు అనారోగ్య కారణంగా కౌంటర్ ధాఖలు చేయలేక పోయామని తెలిపారు. దీంతో న్యాయస్థానం తదుపరి విచారణ ఈనెల 30వ తేదీకి వాయిదా వేసింది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.


మరోవైపు ఏపీలో తీవ్ర కలకలం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొలిక్కి వచ్చిందన్న వార్తల నేపథ్యంలో డొంక కదులుతోంది. ఇప్పటి వరకు వివేకా హంతకులు ఎవరు? వారి వెనుక ఎవరున్నారనే అంశాలపై సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో వివేక ఇంటి వాచ్ మెన్ రంగన్నను సీబీఐ జమ్మలమడుగు కోర్టులో హాజరుపర్చడంతో ఈ మొత్తం వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది.


వాచ్‌మెన్ రంగన్న ఇచ్చిన వాంగ్మూలం సంచలనాన్ని రేకెత్తించింది. సుపారీ ఇచ్చి వివేకను హత్య చేయించారని, 9 మంది ప్రమేయం ఉన్నట్లు రంగన్న మేజిస్ట్రేట్ ముందు స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దీంతో వివేకా హత్య కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులకు రంగన్న ఇచ్చిన వాంగ్మూలం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు వివేక హత్య కేసులో సుమారు 50 రోజులుగా కొనసాగుతున్న సీబీఐ అధికారుల విచారణలో ఎట్టకేలకు కీలక ముందడుగుపడినట్లయింది. పులివెందులకు చెందిన రంగయ్య వైఎస్ వివేక హత్య కేసులో కీలక సాక్షిగా మారాడు.


ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ‘‘జగన్ బెయిల్ రద్దు కేసులో సీబీఐ తడబడుతోందా?. వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ ఇబ్బంది పడుతోందా?. దేశం మొత్తం ఈ రెండు కేసుల వైపే చూస్తోందని సీబీఐకి తెలియదా?. బెయిల్ రద్దు కేసులో సాగదీత యాధృచ్ఛికమమేనా?. వివేకా హత్య కేసులో బదిలీలపై జనంలో చర్చ ఎందుకు జరుగుతోంది. ’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 



Updated Date - 2021-07-27T01:05:17+05:30 IST