Abn logo
Sep 22 2021 @ 16:52PM

jagan అక్రమాస్తుల కేసుపై సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ

హైదరాబాద్‌: సీఎం జగన్ అక్రమాస్తుల కేసుపై సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ జరిగింది. వాన్ పిక్, గృహ నిర్మాణ కేసులపై ఈడీ విచారణ జరిపింది. నేటి విచారణ హాజరుకు సీఎం జగన్‌కు కోర్టు మినహాయింపు ఇచ్చింది. అయితే సీబీఐ కోర్టుకు ఎంపీ విజయసాయిరెడ్డి హాజరైనారు. వాన్ పిక్, లేపాక్షి ఈడీ కేసుల్లో ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు హాజరయ్యారు. లేపాక్షి కేసులో మాజీమంత్రి గీతారెడ్డి హాజరయ్యారు. పారిశ్రామికవేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్, శ్యాంప్రసాద్ రెడ్డి, నిమ్మగడ్డ ప్రకాష్ హాజరయ్యారు. ఐఏఎస్ మురళీధర్‌రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్‌లు బీపీ ఆచార్య, శామ్యూల్, రిటైర్డ్ ఐఏఎస్‌లు మన్మోహన్ సింగ్, బ్రహ్మానందరెడ్డి హాజరయ్యారు. లేపాక్షి, గృహ నిర్మాణ కేసులపై ఈడీ విచారణ అక్టోబర్‌ 28కి వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండిImage Caption