సీఎం డౌన్‌డౌన్‌ నినాదాలు

ABN , First Publish Date - 2021-10-17T09:08:18+05:30 IST

సీఎం డౌన్‌డౌన్‌ నినాదాలు

సీఎం డౌన్‌డౌన్‌ నినాదాలు


‘‘సీఎం డౌన్‌డౌన్‌.. సీఎం డౌన్‌డౌన్‌..’’ దసరా రోజున ఇంద్రకీలాద్రిపై భక్తులు చేసిన నినాదాలు ఇవి. వీవీఐపీ, వీఐపీల క్యూల్లో వెళ్లినవారికి దర్శనం చకచకా జరిగిపోవడం, ఉచిత దర్శనం, టికెట్లు కొనుగోలు చేసిన క్యూలలో దర్శనానికి ఐదారు గంటలు పట్టడంతో భక్తులు అసహనంతో రగిలిపోయారు. అమ్మవారిని త్వరగా దర్శనం చేసుకుని వెళ్లిపోదామని వచ్చిన భక్తులకు, దూరప్రాంతాల నుంచి వచ్చినవారికి దర్శనం ఆలస్యమవడంతో సహనం కోల్పోయారు. దసరా రోజున భక్తులకు దర్శనానికి ఐదారు గంటల సమయం పట్టింది. దీంతో కోపోద్రిక్తులయ్యారు. పోలీసులు వారించినా భక్తులు వినిపించుకోలేదు. ‘‘అసలు ఈ సీఎం హిందువేనా?’’ అంటూ ఓ భక్తుడు ఆగ్రహంతో ప్రశ్నించాడు. అలా కొద్దిసేపు నినాదాలు చేయడంతో క్యూలు వేగంగా ముందుకు కదలడం ప్రారంభమైంది. 

Updated Date - 2021-10-17T09:08:18+05:30 IST