Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న జగన్‌: యనమల

నెల్లూరు: జగన్‌ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తున్నారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తప్పుబట్టారు. గురువారం ఆయన ఉదయం మీడియాతో మాట్లాడారు. దేశంలో అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగం అమలవుతుంటే రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని విమర్శించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కొన్ని విషయాల్లో తప్పులు చేసినా జగన్‌లా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, రాష్ట్రాన్ని బ్రష్టుపట్టించే పనులు చేయలేదన్నారు. ప్రజలు చైతన్యవంతులై జగన్‌ పాలనకు స్వస్తిపలకకుంటే రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు. తన 39 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను కాని ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న జగన్‌లాంటి ముఖ్యమంత్రిని ఇప్పటివరకు చూడలేదని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement