జగన్‌ దిష్టిబొమ్మ దహనం

ABN , First Publish Date - 2021-09-19T05:16:41+05:30 IST

జగన్‌ దిష్టిబొమ్మ దహనం

జగన్‌ దిష్టిబొమ్మ దహనం
షాద్‌నగర్‌ చౌరస్తాలో జగన్మోహన్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తున్నట్టు టీడీపీ కార్యకర్తలు

షాద్‌నగర్‌ అర్బన్‌/ఆమనగల్లు/ఇబ్రహీంపట్నం/చేవెళ్ల: ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటిపై దాడి చేయడాన్ని నిరసిస్తూ టీడీపీ నాయకులు ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దిష్టిబొమ్మ ను దహనం చేశారు. టీడీపీ సీనియర్‌ నాయకుడు చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం షాద్‌నగర్‌ చౌరస్తాలో నిరసన నిర్వహించారు. చంద్రబాబు ఇంటిపై వైసీ పీ గూండాలు దాడిచేయడం అమానుషమన్నారు. వారిని అరెస్టు చేయాలన్నారు. కర్ణకోట రమేష్‌, ఆనంద్‌, అంజయ్య, బి.హన్మంత్‌యాదవ్‌, అంజయ్య, కృష్ణయ్య, బక్కని శ్రీను, రాజు, అనంతయ్య, నరేష్‌ పాల్గొన్నారు. ఆమనగల్లులో టీడీపీ మండల అధ్యక్షుడు కొప్పు యాదయ్య ఆధ్వర్యంలో రాజీవ్‌ కూడలిలో ధర్నా నిర్వహించారు. జగన్మోహన్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. వెంకటేశ్‌, జి.జగన్‌, శివకుమార్‌, నర్సింహ, పాండు పాల్గొన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగిస్తున్న జగన్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని ఇబ్రహీంపట్నం టీడీపీ నాయకులు అన్నారు. జగన్‌ చిత్రపటాన్ని దహనం చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రవీందర్‌, చక్రపాణి, కరుణాకర్‌రెడ్డి, వెంకటే్‌షగౌడ్‌ పాల్గొన్నారు. చేవెళ్లలో పార్లమెంటరీ పార్టీ నియోజకవర్గం అధ్యక్షుడు సుభాష్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో జగన్‌మోహన్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. క్రిష్టయ్య, మాణిక్యం, సత్యనారాయణ, సుధాకర్‌రెడ్డి, యాదయ్య, వెంకటేశ్‌ ఉన్నారు.

Updated Date - 2021-09-19T05:16:41+05:30 IST