Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 19 2021 @ 18:20PM

జగన్ దిష్టిబొమ్మ దగ్ధం.. ఎన్టీఆర్‌భవన్ దగ్గర ఉద్రిక్తత

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌భవన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏపీ సీఎం జగన్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, తెలుగు యువత కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. హైదరాబాద్‌లో ఏపీ సీఎం జగన్‌కు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.


 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఘోర అవమానం జరిగింది. ఇవాళ ఉదయం నుంచి అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మంత్రులు కొడాలి నాని, కురసాల కన్నబాబుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర వ్యాఖ్యలతో టీడీపీ సభ్యులను అవమానిస్తూ మాట్లాడారు. ఆఖరికి చంద్రబాబు కుటుంబంలోని మహిళలపై కూడా వైసీపీ ఎమ్మెల్యేలు నోరుపారేసుకున్నారు. దీంతో చంద్రబాబు తీవ్ర మనస్తాపం చెంది కంటతడి పెట్టారు.

Advertisement
Advertisement