ఇదేమి పద్ధతో!

ABN , First Publish Date - 2020-10-14T08:03:31+05:30 IST

‘‘సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చేసిన ఫిర్యాదును, ఇతర ‘కాన్ఫిడెన్షియల్‌’ పత్రాలను బహిర్గతం చేయడమంటే.. అధికార రహస్యాలను...

ఇదేమి పద్ధతో!

  • అధికారిక రహస్యాలతో ‘రాజకీయం’
  • రాజ్యాంగ ప్రమాణం ఉల్లంఘనే..
  • సచివాలయంలో దీనిపైనే చర్చ!

‘‘సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చేసిన ఫిర్యాదును, ఇతర ‘కాన్ఫిడెన్షియల్‌’ పత్రాలను బహిర్గతం చేయడమంటే.. అధికార రహస్యాలను బట్టబయలు చేయడమే. ఇది సీఎంగా బాధ్యతలు చేపట్టేటప్పుడు చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించడమే’’ అని అధికార వర్గాలు చెబుతున్నాయి. సీఎం జగన్‌ తాను రాసిన లేఖతోపాటు గతంలో చంద్రబాబు సీఎం హోదాలో రాసిన ‘కాన్ఫిడెన్షియల్‌’ ఉత్తరాల నూ బయటపెట్టారు.


‘‘గతంలో కోర్టులు వ్యతిరేక తీర్పులను ఇస్తే.. తమ విధానాన్ని తప్పుబట్టినట్లు గా భావించి నైతికతకు పెద్దపీట వేస్తూ సీఎం ప దవికి రాజీనామా చేసిన వారున్నారు. సుప్రీంకోర్టు ను ఆశ్రయించడం.. లేదా, పద్ధతి మార్చుకోవడం సహజం. కానీ... మొట్టమొదటిసారిగా న్యాయమూర్తులనే తప్పు పడుతున్న ఉదంతాన్ని చూస్తున్నాం’’ అని చెబుతున్నారు. తమకు అన్యాయం జరుగుతోందని భావిస్తే సీజేకు ఫిర్యాదు చేసుకోవచ్చున ని.. కానీ, ఆ అధికారిక రహస్యాలను రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెల్లడించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సీఎం రాసిన లేఖతో జత పరచిన న్యాయమూర్తు ల లేఖలపై భాగాన ‘కాన్ఫిడెన్షియల్‌’ అని రాసి ఉండడాన్ని ఒక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ప్రస్తావించారు. ‘‘ఇలా కాన్ఫిడెన్షియల్‌ లేఖలు బయటకు వచ్చినప్పుడు, సంబంధిత సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. మరి... ఇప్పుడు నేరుగా ప్రభుత్వమే నిబంధనలను ఉల్లంఘించింది. ఇప్పుడు ఎవరిపై చర్యలు తీసుకోవాలో!’’ అని మరో అధికారి వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-10-14T08:03:31+05:30 IST